odi Biyyam song,ఒడిబియ్యం పాట(123):శ్రీ వాసవి అష్టోత్తర గాన నీరాజనం,Ndk. రచన,గానం:శరణ లలితకుమారి,Atp

Описание к видео odi Biyyam song,ఒడిబియ్యం పాట(123):శ్రీ వాసవి అష్టోత్తర గాన నీరాజనం,Ndk. రచన,గానం:శరణ లలితకుమారి,Atp

#Odi Biyyam significance
#Odi Biyyam song
#Odi Biyyam pata
#vasavi devi ki Odi Biyam song
#ఒడిబియ్యం పాట#(123):శ్రీ వాసవి అష్టోత్తర గాన నీరాజనం,నందికొట్కూర్.
రచన,గానం:శరణ లలితకుమారి,అనంతపురం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ వాసవి అష్టోత్తర గాన నీరాజనం.
వాసవి పాట:123
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఒడినించగా వనితలు రారండి
శ్రీదేవ దేవికి
ఒడినించగ వనితలు రారండి||ఒడి||

సుందర వదనిని వాసవి మాతను
బహు సుందరముగ అలంకరించీ||సుందర||
పడతులు భక్తితొ పరిపక్వముగా..ఆ.
పడతులు భక్తితొ పరిపక్వముగ ఫలహారములు నివేదించగ ||ఒడి||

సౌభాగ్యమ్ముల పసుపుకుంకుమలు
కరకంకణములు గాజులు పూలూ.||సౌ||
సిరి పాదాల మువ్వలు..మెట్టెలూ... ఊ..||సిరి||
సిరి పాదాల మువ్వలు..మెట్టెలూ
ధరింప చేసిన ఆర్యు మాతకు.||ఒడి||

పీతాంబరములు పట్టు వస్త్రములు
పట్టు రవికెలు. తాంబూలాలు||పీ||
స్వర్ణాభరణాల శోభ తో వెలిగే ... ఏ..
ఏ..||పీతాం||
స్వర్ణాభరణాల శోభ తో వెలిగే
మంగళ కరమగు తేజో మూర్తి కి ||ఒడి||

ముత్యం. పగడం .నల్లపూసలు పసుపుకొమ్ములు పప్పులుండలు||ముత్యం||
కొబ్బర.. వక్కలు..బియ్యం పోసి .. ఈ. ఈ..
కొబ్బర.. వక్కలు..బియ్యం పోసి
అమ్మల గన్న ..అన్నపూర్ణకు||ఒడి||

భువన భాండముల పాలన చేసె
శ్రీ భువనేశ్వరి శ్రీ పరమేశ్వరి ||భు||
భక్తుల పాలిట కల్పవల్లిగా ..ఆ...ఆ..
భక్తుల పాలిట కల్పవల్లిగా
వరాలనోసగే వాసవి మాతకు||ఒడి||

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సేకరణ :నందికొట్కూర్
వాసవి మహిళా సంఘం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Комментарии

Информация по комментариям в разработке