సమాధి మందిర నిర్మాణం గురించి బూటి కంటే ముందే బూటి అల్లుడు నార్కెకు బాబా సూచించిన కథను వినండి

Описание к видео సమాధి మందిర నిర్మాణం గురించి బూటి కంటే ముందే బూటి అల్లుడు నార్కెకు బాబా సూచించిన కథను వినండి

షిరిడి సిరులు // Shiridi Sirulu Ep 44 Pa 02 || సమాధి మందిర నిర్మాణం గురించి బూటి కంటే ముందే బూటి అల్లుడు నార్కెకు బాబా సూచించిన కథను వినండి // Shiridi SaiBaba Story // SaiLeela ||
నాగపూర్‌ నివాసి, కోటీశ్వరుడు అయిన శ్రీ గోపాలరావ్ ముకుంద్ అలియాస్ బాపూసాహెబ్ బూటీ సాయిబాబాకు గొప్ప భక్తుడు. అతనొక న్యాయవాది మరియు వ్యాపారవేత్త. అతని వ్యాపారానికి సంబంధించిన శాఖలు పలుచోట్ల ఉన్నాయి. బాబా అతన్ని ప్రేమగా “బూటయ్యా!” అని పిలిచేవారు. చాలామంది భక్తులు బాబాతో మాట్లాడేవారు, వాదించేవారు. కానీ బూటీ, నూల్కర్ మరియు ఖపర్డేలు ముగ్గురు మాత్రం బాబా సమక్షంలో ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. వాళ్ళ లక్ష్యమొక్కటే - బాబా చెప్పినట్లు నడుచుకోవడం.కోటీశ్వరుడైనప్పటికీ బూటీ సాధుసత్పురుషుల సేవను ఎంతో ఇష్టపడేవాడు. అతను బెరార్‌కి చెందిన సత్పురుషుడు గజానన్ మహరాజ్‌ను గురువుగా భావిస్తూ సంవత్సరంలో ఎక్కువ సమయం వారి సేవలో గడపాలని తలచేవాడు. ఒకసారి బూటీ హజరత్ తాజుద్దీన్‌బాబాను దర్శించాడు. ఆయన, "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్? నీ గురువు శిరిడీలో నీకోసం వేచి ఉన్నారు, త్వరగా అక్కడికి వెళ్ళు!" అని అన్నారు. ఆయన మాటలు బూటీకేమీ అర్థం కాలేదు. ఆ తరువాత 1910వ సంవత్సరంలో శ్రీ ఎస్.బి.ధుమాళ్ అతన్ని మొట్టమొదటిసారి సాయిబాబా దర్శనానికి తీసుకుని వెళ్ళాడు. ఒకప్పుడు గజానన్ మహరాజ్ సేవలో ఎక్కువ సమయం గడపాలనుకున్న బూటీ, బాబా దర్శనంతో ఎంతో తృప్తి చెంది, కుటుంబంతో సహా తరచూ శిరిడీ వెళ్లి బాబా సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతుండేవాడు. క్రమంగా అతను శిరిడీనే తన శాశ్వత నివాసం చేసుకోవాలని ఆరాటపడసాగాడు. అందుకోసం శిరిడీలో ఒక భవన నిర్మాణం చేయాలని తరచూ అనుకుంటుండేవాడు. ప్రతిరోజూ మధ్యాహ్న ఆరతి తరువాత, బాబాకు ఎడమవైపున కూర్చుని బూటీ భోజనం చేసేవాడు. బాబా రోజూ లెండీకి వెళ్లిరావడం ఒక ఉత్సవంగా మారినప్పటినుండి అతను బాబాకు ఎడమవైపున నడిచేవాడు. ఒకరాత్రి బూటీ, శ్యామాలు దీక్షిత్‌వాడా పైఅంతస్తులో నిద్రపోతున్నారు. కొంతసేపటికి బూటీకి ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా అతనికి దర్శనమిచ్చి, "మందిరంతో సహా ఒక వాడాను నిర్మించు” అని ఆదేశించారు. వెంటనే అతనికి మెలకువ వచ్చి, కలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతలో ప్రక్కనే పడుకుని ఉన్న శ్యామా ఏడుస్తున్న శబ్దం అతనికి వినిపించింది. బూటీ అతనిని మేల్కొలిపి, "మీరెందుకు ఏడుస్తున్నార”ని అడిగాడు. అందుకు శ్యామా, "నాకొక స్వప్నదర్శనమైంది. అందులో బాబా కనిపించి, “మందిరంతో సహా ఒక వాడాను నిర్మించండి! నేనక్కడ ఉండి అందరి కోరికలు తీరుస్తాను” అని చెప్పారు. మధురమైన వారి ప్రేమ పలుకులు విని నాకు భావోద్రేకం కలిగి, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఆ పారవశ్యంలో నా కళ్ళనుండి కన్నీళ్లు పొంగిపొర్లుతున్నాయి" అని చెప్పాడు. శ్యామా మాటలు విన్న బూటీ తనకు కూడా అదే కల వచ్చిందని చెప్పాడు. ఇద్దరికీ ఒకే కల వచ్చినందుకు శ్యామా, బూటీలు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ కల ద్వారా శిరిడీలో స్వంత భవనం నిర్మించుకోవాలన్న తన కోరికకు బలం చేకూరి, ఆలస్యం చేయక మందిరంతో సహా ఒక వాడాను నిర్మించాలని బూటీ సంకల్పించాడు. వెంటనే శ్యామా, బూటీలిరువురూ కూర్చుని వాడా రూపురేఖల నమూనాను తయారుచేశారు.మరుసటిరోజు ఉదయం ముగ్గురూ బాబా వద్దకు వెళ్లారు. శ్యామా తనకి, బూటీకి గతరాత్రి వచ్చిన కల గురించి సాయిబాబాతో చెప్పాడు. ప్రసాదించారు.బూటీవాడా నిర్మాణం 1915, డిసెంబర్ 30న ప్రారంభమైంది (ఖఫర్డే డైరీ, పేజి 123). వాడా నిర్మాణం 1915లో ప్రారంభమైనప్పటికీ, 1913 లోనే బూటీ అల్లుడైన నార్కేతో బాబా, "నీ మామ ఇక్కడొక మందిరం నిర్మిస్తాడు. నువ్వు దానికి ధర్మకర్తవవుతావు" అని ఈ నిర్మాణం గురించి ప్రస్తావించడం బాబా యొక్క సర్వజ్ఞతకు నిదర్శనం. బూటీవాడా నిర్మాణ పనులను శ్యామా దగ్గరుండి పర్యవేక్షిస్తుండేవాడు. ముందుగా బావి త్రవ్వి, పునాది నిర్మించారు. లెండీకి వెళ్లివచ్చేటప్పుడు బాబా ఆ నిర్మాణపు పనులను పరిశీలించి, "ఇక్కడ ఒక తలుపు, అక్కడ ఒక కిటికీ ఉంచండి. ఇక్కడ తూర్పుగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేయండి. అది వాడా అందాన్ని మరింత పెంచుతుంది" అంటూ సూచనలిస్తుండేవారు. కొంత నిర్మాణం జరిగాక పర్యవేక్షణ బాధ్యతలను బాపూసాహెబు జోగ్‍కి అప్పగించారు బాబా. పనులు చకచకా సాగుతుండగా భవనం మధ్యలో మందిరం కోసం ఒక వేదిక ఏర్పాటు చేసి, దానిపై మురళీధరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బూటీకి ఆలోచన వచ్చింది. కానీ అతను బాబాను సంప్రదించకుండా ఏ పనీ ప్రారంభించడు. అందుచేత తనకొచ్చిన ఆలోచనను శ్యామాతో చెప్పి, బాబా అనుమతి తీసుకోమని చెప్పాడు. తమ దినచర్యలో భాగంగా బాబా లెండీ నుండి తిరిగి వస్తూ బూటీవాడా వద్దకు చేరుకోగానే, శ్యామా వారికి నమస్కరించి బూటీ ఆలోచనను చెప్పి, "మీరు అనుమతిస్తే మందిర నిర్మాణం త్వరగా పూర్తవుతుంద"ని చెప్పాడు. బాబా సంతోషంగా తమ అనుమతినిస్తూ, "సరే, అలాగే కానివ్వండి. మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత, మేము అక్కడికి వచ్చి ఉంటాము" అని వాడా వైపు చూస్తూ, "వాడా నిర్మాణం పూర్తయ్యాక దానిని మనమే ఉపయోగించుకుందాం. మనమందరమూ అక్కడే ఆడుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా సమయాన్ని గడుపుదాం" అని అన్నారు. అప్పుడు శ్యామా, "దేవా! ఇది మీ ఖచ్చితమైన అనుమతే అయితే, మీ అనుమతినే శుభముహుర్తంగా భావించి మందిర నిర్మాణం ప్రారంభించడానికి కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టనా?" అని బాబాను అడిగాడు. అందుకు బాబా "ఆఁ.. కొట్టు, కొట్టు!" అన్నారు. బాబా ఆదేశానుసారం శ్యామా వెంటనే వెళ్లి కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టాడు.

Комментарии

Информация по комментариям в разработке