Ongole Famous Upma Hotel || 90 Years Old Famous Hotel ||ఒంగోలు ఫెమస్ ఉప్మా || 90ఏళ్ల చరిత్ర గల ఉప్మా

Описание к видео Ongole Famous Upma Hotel || 90 Years Old Famous Hotel ||ఒంగోలు ఫెమస్ ఉప్మా || 90ఏళ్ల చరిత్ర గల ఉప్మా

అడ్రస్ :- మస్తాన్ దర్గా సెంటర్, ఒంగోలు..
ఒంగోలు లోని మస్తాన్ దర్గా సెంటర్ లో ఉన్న ఈ హోటల్ ప్రారంభించి షుమారు గా 90ఏళ్ళు.. జీవనోపాధి కై కొండయ్య గారు ఆనాడు ఈ హోటల్ ఏర్పాటు చేసుకున్నారు..లాభాపేక్షకు తావులేకుండా తక్కువ ధరకు ఉప్మా,ఇడ్లీలు,దోసెలు ఒంగోలు వాసులకు అందిస్తూ ప్రారంభించిన స్వల్పకాలంలోనే మంచి పేరు గడించారు..ప్రత్యేకంగా ఎంతో రుచికరమైన ఉప్మా తయారు చేసి వడ్డిస్తూ ఈ ప్రాంత వాసుల మన్ననలు పొందారు.. కొండయ్య గారి తదుపరి వారి కుమారుడు సుబ్రహ్మణ్యం గారు ఆ తరువాత సుబ్రహ్మణ్యం గారి కుమారుడు కోటేశ్వరరావు గారు హొటల్ నిర్వహణ చూడగా ఇప్పుడు కోటేశ్వరరావు గారి కుమారుడు రాజేష్ గారు హోటల్ నిర్వహిస్తున్నారు...వారసత్వం గా మూడు తరాల వారు నిర్వహణ బాధ్యతలు చేపట్టారు..హోటల్ కు పేరేమి పెట్ట లేదు వారు..ఎవరు నిర్వహిస్తున్న తరుణంలో వారి పేరు తో పిలవసాగారు ఒంగోలు వాసులు..
నాటి నుండి నేటి వరకు అల్పాహారం తయారీ లో నాణ్యత పాటిస్తూ ఒంగోలు లో మంచి హోటల్ గా కీర్తి గడించింది..విస్తీర్ణంలో చిన్న హోటల్... ఇక్కడ లభించే అల్పాహారలా రుచిని బేరిజు వేసుకుని చెప్తే మాత్రం బ్రహ్మాండమైన హోటల్..మీరు ఎప్పుడైనా ఒంగోలు వెళితే మస్తాన్ దర్గా సెంటర్ లోని ఈ హోటల్ టిఫిన్ చేయండి.. ప్రత్యేకించి ఇక్కడ లభించే ఉప్మా రుచి చూడండి ఖచ్చితంగా సంతృప్తి చెందుతారు..

Music credits :- YouTube audio Library

Комментарии

Информация по комментариям в разработке