Kadapa Famous Karam Dosa | Rosayya Gari Dosa Center | Ghee Karam Dosa | Egg Dosa| Kadapa | Food Book

Описание к видео Kadapa Famous Karam Dosa | Rosayya Gari Dosa Center | Ghee Karam Dosa | Egg Dosa| Kadapa | Food Book

కారం దోశ వంటల పరంగా కడపకు గుర్తింపు తెచ్చింది.

దేశ,విదేశాలలో సైతం కడప కారం దోశ పేరిట అల్పాహారం లభిస్తుంది.

ఈ ఉపాహారం అంతటి ప్రాముఖ్యత పొందడానికి కీలకం ఎర్ర కారం మరియు పప్పుల పొడి.కొన్ని చోట్ల బొంబాయి పచ్చడి కూడా వినియోగిస్తారు.

మిరప కాయలు, ఉల్లి పాయలు, ఉప్పుతో ఎర్ర కారం,వెల్లుల్లి,శనగపప్పుతో పప్పుల పొడి తయారు చేస్తారు.ముడి పదార్థాల వినియోగంలో నిర్దిష్టం చాలా అవసరం లేకుంటే దోశకు వాస్తవికత చేకూరదు.అలానే ఎర్ర కారం ఓ పూట నిల్వ ఉంచి వినియోగించుకుంటే పచ్చి స్వభావం పోయి మంచి రుచి దోశకు చేకూరుతుంది.

పలు పదార్థాలతో మలుపు ఓ ఆహారంగా కనుక దోశ కాల్చడంలో అనువు ఉండాలి. ఆ శ్రేష్ఠత కడప వాసులకు కలదు..

అంతిమంగా నూనె తోనైనా,నెయ్యితోనైనా రూపుదీరిన దోశ కమ్మగా ఉంటుంది.ఆ రుచి కారణంగానే కడప కారం దోశకు విశిష్టత వరించింది.

ఇక రోశయ్య గారి అల్పాహార శాలలో కారం దోశ, పన్నీర్ చీజ్ దోశ తినడం జరిగింది.తిన్న సందర్భం అనుభూతి పూర్వకం ఆ అ రుచుల వివరణ కార్యక్రమం పరంపరలో వివరిస్తాను.


చిరునామా:- రోశయ్య దోశ సెంటర్ ,పాత మహిళ పోలీస్ స్టేషన్ సమీపంలో, కడప.

Комментарии

Информация по комментариям в разработке