Foundation Stone For Hyderabad Old City Metro On March 8 | పాతబస్తీలో మెట్రో పరుగులు || Idi Sangathi

Описание к видео Foundation Stone For Hyderabad Old City Metro On March 8 | పాతబస్తీలో మెట్రో పరుగులు || Idi Sangathi

పాతబస్తీ..! హైదరాబాద్ చరిత్రకు ఆనవాలు..! నిజాం నవాబుల ఏలుబడిలో గొప్పగా ఎదిగిన ప్రాంతం..! కానీ...కాలక్రమంలో ఆ చారిత్రక ప్రాంతం...అభివృద్ధికి ఆమడదూరంలోనే ఆగిపోయింది. సువిశాలమైన భాగ్యనగరంలో ఇరుకు సందులతో...ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయి...పాత కాలం ఆనవాళ్లను వదులుకోలేక...అవస్థలు పడుతోంది. చెప్పుకోవడానికి చార్మినార్, మక్కామసీదు లాంటి ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయే తప్ప...అక్కడివారి కష్టాలు...షరా మామూలే..! ప్రభుత్వాలు మారినా...పాలకులు ఎవరొచ్చినా...పాతబస్తీ అంటే పాత..బస్తీ లానే చూసేవాళ్లు..! కానీ, ఇప్పుడు పాతబస్తీ కథ వేరేగా ఉంటుందని అంటోంది...కాంగ్రెస్ ప్రభుత్వం..! అక్కడి ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తోన్న మెట్రోరైలును...పాతబస్తీలో పరుగులు తీయించబోతుంది. అటున్న ఇటుక...ఇటు జరపకుండానే...చారిత్రక కట్టడాల జోలికి పోకుండానే...నిమిషాల వ్యవధిలో ఆ మూల నుంచి ఈ మూలకు మెట్రోరైలును అందుబాటులోకి తీసుకురాబోతోంది. మెట్రోరైలు విస్తరణలో భాగంగా రెండోదశలో...5.5 కిలోమీటర్ల మేర పాతబస్తీలో మెట్రోరైలు నిర్మాణానికి ప్రభుత్వం...శుక్రవారం పునాదిరాయి వేయబోతుంది. ఈ నేపథ్యంలో పాతబస్తీ మెట్రోరైలుకు సంబంధించిన మరిన్ని వివరాలు...ఈ కథనంలో తెలుసుకుందాం.
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке