#allmsheshagirirao

Описание к видео #allmsheshagirirao

ప్రముఖ తెలుగు కథారచయితగా పేరుగాంచిన అల్లం శేషగిరిరావు 9 డిసెంబర్, 1934న ఒడిషా (నాటి ఒరిస్సా)లోని గంజాం జిల్లాలో జన్మించారు. రైల్వేశాఖలో పనిచేసి పదవీవిరమణ చేశారు. విశాఖపట్టణంలో నివసిస్తూ 3 జనవరి, 2000 నాడు మరణించారు.

సాహితీ ప్రస్థానం:
అల్లం శేషగిరిరావు తొలి కథ "మృగయా వినోదం అను పులి ఛాన్స్" 1967లో ఆంధ్రజ్యోతిలో అచ్చయింది. తెలుగు సాహిత్యంలో అరుదైన వేట కథల ద్వారా ఆయన కథకుల్లో ప్రముఖ స్థానాన్ని పొందారు. "మంచి ముత్యాలు", "అరణ్యఘోష" కథాసంపుటాలు ప్రచురించారు. మనిషి జీవితంలోని వివిధ పార్శ్వాల్ని అన్వేషిస్తూ రాసిన వేట కథలు-చీకటి, పులిచెరువులో పిట్టల వేట, డెత్ ఆఫ్ ఎ మాన్ ఈటర్, మృగతృష్ణ, వఱడు ప్రాచుర్యం పొంది ఎన్నో ఉత్తమకథల సంపుటాల్లో పునర్ముద్రణ పొందాయి..

వఱడు వీరి ప్రసిద్ధ కథ

Комментарии

Информация по комментариям в разработке