సుత్తివేలు గారు పుట్టిపెరిగిన ఇల్లు | Suttivelu home tour | Raja Telugu Vihari

Описание к видео సుత్తివేలు గారు పుట్టిపెరిగిన ఇల్లు | Suttivelu home tour | Raja Telugu Vihari

#suttivelu #suttiveluhometour #suttiveluvillage
సుత్తివేలు గారు పుట్టిపెరిగిన ఇల్లు | Suttivelu home tour | Raja Telugu Vihari
సుత్తివేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. ఈయన 1947 ఆగస్టు 7 భోగిరెడ్డిపల్లి, మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లాలో జననం. చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడు. అలాగే ఈయన చిన్నతనంలో చాలా సన్నగా ఉండేవారు. దానితో ఈయన పక్కంటి పిన్ని జానకాంబ ఈయనను వేలు అని పిలిచేవారు.ఈయన నటించిన నాలుగు స్తంభాలాటలో ఈయన పాత్ర పేరు 'సుత్తి'. ఆ చిత్ర విజయం తరువాత అందరూ ఈయనను సుత్తివేలు అని పిలవడం ప్రారంభింఛారు. సుత్తివేలు తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. బాల్యం నుండి ఈయనకు నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ. దానితో ఏడవ తరగతి తప్పి, తండ్రితో చీవాట్లు తిన్నారు.ఈయనకు చిన్నప్పటి నుండి నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి. 1966లో పి.యు.సి చదివిన అనంతరం, హైదరాబాదుకు చేరుకున్నాడు. అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవారు. 1967లో ఉద్యోగం మారి బాపట్ల చేరుకున్నారు. ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవారు.1981లో విశాఖపట్నం డాక్ యార్డులో శాశ్వత ఉద్యోగం రావడంతో అక్కడికి మకాం మార్చారు. భమిడిపాటి అంతా ఇంతే నాటకం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. మనిషి నూతిలో పడితే అనే నాటకంలో ఆయన పాత్రను చూసిన హాస్యబ్రహ్మ జంధ్యాల తన చిత్రం ముద్ద మందారంలో అయనకు రిసెప్షనిష్టుగా చిన్న పాత్రను ఇచ్చారు. ఇలా 1981 లో సుత్తివేలు సినీరంగ ప్రస్థానం జరిగింది. అటు పిమ్మట జంధ్యాల, తన వరుస చిత్రాలైన మల్లె పందిరి, నాలుగు స్తంభాలాట లలో కూడా సుత్తివేలుకు అవకాశాలనిచ్చారు. ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో సుత్తివేలు ఉద్యోగం పోగొట్టుకున్నారు.
ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా స్వీకరించాడు. ఆనంద భైరవి, రెండుజెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించారు. త్రిశూలం చిత్రం తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో కొద్దిరోజులు కష్టాలను అనుభవిందారు. తర్వాత టి. కృష్ణ వరుసగా ఐదు చిత్రాలలో అవకాశాలిచ్చారు. అప్పటి వరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలుకు, ఈ చిత్రాలలో తన నటనలోని మరో పార్శ్వాన్ని ఆవిర్భవించే అవకాశం చిక్కింది. వందేమాతరం, ప్రతిఘటన, కలికాలం, ఒసేయ్ రాములమ్మ చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. వందేమాతరం చిత్రానికి గాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.
Note :
Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
#viralshorts
#teluguviralshorts
#shorts
#youtubeteluguviralshorts
#viralvideos
#viralshortstelugu
#rajateluguvihari
#gvmedia
#villagevihari
#vikramvihari
#telugutravelvloger
#rajireddy
#naanveshana
#prapanchayatrikudu
#bankokpilla
#hometour
#celebrityhometours
#hometours
#hometoor
#housetour
#housetoor

Комментарии

Информация по комментариям в разработке