Renowned Author Acharya Betavolu Ramabrahmam Special EXCLUSIVE Interview | Vyjayanthi | Vyus.in

Описание к видео Renowned Author Acharya Betavolu Ramabrahmam Special EXCLUSIVE Interview | Vyjayanthi | Vyus.in

Renowned Author Acharya Betavolu Ramabrahmam Special EXCLUSIVE Interview | Vyus.in
#Acharyabetavoluramabrahmam #vyus #Authorbetavoluramabrahmam #Novels #Books #bethavoluvillage #bethavolulifestyle #tikkanabharatam
Sri #chaganti Koteswara Rao SUPER Exclusive Interview #vijayanthi Telugu #pravachanalu | Vyus.in

   • Sri #chaganti  Koteswara Rao SUPER Ex...  
అవధాన రాజ్యాంగ నిర్మాత
బేతవోలు రామబ్రహ్మం... కేంద్ర భాష సమ్మాన్ పురస్కార గ్రహీత. తెలుగు భాషకు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా దీనిని కేంద్రం ప్రకటించింది. గుంటూరు సంస్కృత కళాశాలలో అధ్యాపకునిగా ప్రారంభించి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు విభాగ అధిపతిగా ఉద్యోగ జీవితాన్ని విరమించారు. అవధానాలు చేసారు. రేడియోలో అనేక ప్రత్యక్ష ప్రసారాలలో పాల్గొన్నారు. మహామహులతో పరిచయాలు ఆయన సాహిత్య సేవను మలుపు తిప్పాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయాలలో పనిచేశారు. పద్య రచనలో మేటిగా పేరుపొందారు. పద్యమే పరమార్ధంగా జీవించారు. కేంద్ర భాష సమ్మాన్ పురస్కారం లభించిన సందర్భంగా వ్యూస్ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారితో ముఖాముఖి నిర్వహించింది. అవధానాలు, ప్రవచనాలు, భువన విజయాలు, రేడియో కార్యక్రమాలు, ప్రముఖులతో పరిచయాలు... ఇలా ఎన్నో అంశాలను ఆయన వైజయంతి మాటామంతిలో వివరించారు. గురువు ఎలా ఉండాలో తెలియజెప్పారు. ప్రవచనకర్తలు చెప్పాల్సిందేమిటో ఆయన ఇందులో సూచనలు చేశారు.

బేతవోలు రామబ్రహ్మం పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల గ్రామంలో ఒక అతి సామాన్య కుటుంబంలో 1948, జూన్ 10 న జన్మించాడు. కష్టాలే తోడుగా ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ తెలుగు చదివాడు. తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య తూమాటి దొణప్ప పర్యవేక్షణలో తెలుగు వ్యాకరణాలపై సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం అనే అంశంపై పిహెచ్.డి. చేశాడు.
ఉద్యోగం
‘భారతి’ లేని లోటును తీర్చిన ‘వాజ్ఞ్మయి’ త్రైమాసిక పత్రిక పేరు ఇతడు సూచించిందే. హైదరాబాద్‌లో ప్రారంభమై ఏడాది పాటు నడిచిన ఆ పత్రికను బొమ్మూరుకు తీసుకెళ్ళి పరిశోధనలో ప్రామాణికతను పాటిస్తూ తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సంచికగా రూపొందించడంలో కీలకంగా నిలిచాడు. ఇతడి మార్గదర్శకత్వంలో పాతికమంది వరకు పీహెచ్‌డీలు చేసి డిగ్రీలు పొందారు.

2005లో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా చేరారు.
సాహిత్య రంగం
ఇతడు రావూరి వెంకటేశ్వర్లు ప్రోత్సాహంతో, ప్రేరణతో భాషాప్రవీణ రెండవ సంవత్సరం చదివేప్పుడే అవధానాల వైపు ఆకర్షితుడై పద్ధెనిమిదేళ్ల కే (1967లో) నవరాత్రి ఉత్సవాలకు మొదటి అవధానం చేశాడు. దాదాపు పాతిక సంవత్సరాల్లో 300 వరకు అవధానాలు చేసి తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్నాడు. తర్వాత లెక్కలేనన్ని అవధాన సభలకు సంచాలకత్వం వహించాడు. కొవ్వూరు సంస్కృత కళాశాల నుంచి వెలువడే ‘గౌతమి’ మాసపత్రికకు ఒక్క సంవత్సరం పాటు సంపాదకుడుగా వ్యవహరించి అంతవరకు గ్రాంథికంలో వెలువడుతున్న ఆ పత్రికను పూర్తిగా వ్యవహారంలోకి తెచ్చిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఆ పత్రికలో ఇతను ‘జయసింహ చరిత్ర’ ( కల్పిత కథా ప్రబంధం) అన్న శీర్షికతో సరళ శైలిలో పద్యాలు వ్రాశాడు.
ఒకసారి నాగార్జున విశ్వవిద్యాయలంలో బుద్ధిస్ట్ స్టడీస్ కేంద్రాన్ని ప్రారంభిచడానికి భూటాన్ దేశపు మఠాధిపతి జె.కంపూ, వారి బృందం వచ్చారు. వారితోపాటు అప్పటి మన ఉపరాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్, యూజీసీ వైస్ చైర్మన్ ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి కూడా వచ్చారు. ప్రారంభోత్సవం అయ్యాక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బేతవోలు రామబ్రహ్మం రాసిన ‘సౌందర నందం’ నాటకాన్ని ఆ భూటాన్ మఠాధిపతి, బృందం సభ్యులు నిల్చొనే తిలకించారు. నాటకం అయ్యాక బుద్ధుడి భిక్షాపాత్రని డాలర్లతో నింపి, రచయితను అభినందించి, ఆ ఆనందంలో మీరంతా మా దేశం వచ్చి పలుచోట్ల ప్రదర్శనలు ఇవ్వమన్నారు. దాంతో ఇతడు భూటాన్ వెళ్ళి అక్కడ ‘ఉన్మత్త యక్షరాజం, సౌందరనందం’ వంటి బౌద్ధ సంబంధి నాటక ప్రదర్శనలు ఇప్పించి, అక్కడివారి ఆదరాభిమానాలను చూరగొన్నాడు. ఇలా ఇతడు తన రచనల ద్వారా విదేశీయులను సైతం ఆకర్షించాడు.
ఇతడు బొమ్మూరు విశ్వవిద్యాలయం తరపున ఒకసారి ‘వచన కవితకు షష్టిపూర్తి’ అన్న శీర్షికతో కవి సమ్మేళనాలు, సభలు నిర్వహించాడు. తరువాత హైదరాబాదులో ‘ఆంధ్ర పద్య కవితా సదస్సు’ నిర్వహించి నండూరి రామకృష్ణమాచార్యులు అధ్యక్షలుగా,ఇతడు ఉపాధ్యక్షులుగా రాష్ట్రం నలుదిశలా పర్యటించి పద్యం విశిష్టతను తెలిపారు. ఇతడు కొత్త గోదావరి వంటి పద్య కావ్యాలే కాకుండా నాటకాలూ వ్రాశాడు. కథలు వ్రాశాడు. అనువాద రచనలు వ్రాశాడు. సాహిత్య వ్యాసాలు, పరిశోధనా గ్రంథాలు వ్రాశాడు. అన్నింటికన్నా సంస్కృత నాటకాలకు వ్యాఖ్యానాలు రాసి ఎనలేని కీర్తి గడించాడు. దేవీ భాగవతం వచన రచన ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. తొలినాళ్ళలో నాస్తిక భావాలున్న ఇతడికి ఆధ్యాత్మిక దిగ్ధర్శకత్వం నెరపినవారు లక్ష్మణ యతీంద్రులు. ఇతడికి దిశానిర్దేశం చేసి ఆచార్యునిగా తీర్చినది ఆచార్య తూమాటి దొణప్ప.

Visit us : https://vyus.in/

Follow Us @
Facebook:   / vyustheunbiased  
Twitter :   / vyusopinion  

Join Us @
Telegram : https://t.me/vyus_The_Unbiassed

Комментарии

Информация по комментариям в разработке