ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను ॥ Hosanna Ministries Pas.FREDDY PAUL Anna live song

Описание к видео ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను ॥ Hosanna Ministries Pas.FREDDY PAUL Anna live song

#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna
#4k #hosannaministries #christiansongs #gospelsongs

ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా (2)
కలవరము నొందను నిను నమ్మియున్నాను (2)
కలత నేను చెందను కన్నీళ్లు విడువను (2)

చరణం 1:
ఆకాశము పై నీ సింహాసనము ఉన్నది
రాజ దండముతో నన్నేలుచున్నది (2)
నీతిమంతునిగా చేసి నిత్య జీవమనుగ్రహించితివి (2)
నేనేమైయున్నానో అది నీ కృపయే కదా
" ఆకాశము "

చరణం 2:
ఆకాశము నుండి నాతో మాట్లాడుతున్నావు
ఆలోచన చేత మాట్లాడుచున్నావు
నీ మహిమ తో నన్ను నింపి
నీ దరికి నన్ను చేర్చితివి (2)
నీవుండగా ఈ లోకం లో ఏదియు
నాకక్కరలేనే లేదయ్యా (2) " ఆకాశము "

చరణం 3:
ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చియున్నది
అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది (2)
నా హృదయమే నీ మందిరమై తేజస్సు తో నింపితివి (2)
కృపాసనము గా నన్ను మార్చి
నాలో నిరంతరము నివసించితివి (2) " ఆకాశము "

చరణం 4:
ఆకాశం నీ మహిమను వివరించుచున్నది
అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది (2)
భాష లేని మాటలే స్వరమై వినబడినవి (2)
పగలు బోధించుచున్నది - రాత్రి జ్ఞాన మిచ్చుచిన్నది
" ఆకాశము "

చరణం 5:
కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకే నిర్మించుచున్నవు (2)
మేఘ రధములపై అరుదెంది నన్ను కొనిపోవా
ఆశతో వేచియుంటిని - త్వరగా దిగిరావయ్యా (2)
" ఆకాశము "

Комментарии

Информация по комментариям в разработке