6 AM Mutton Biryani In Kadapa | Early Morning Biryani | Mutton Dum Biryani | Kadapa | Food Book

Описание к видео 6 AM Mutton Biryani In Kadapa | Early Morning Biryani | Mutton Dum Biryani | Kadapa | Food Book

స్థానిక అభిరుచికి అనుగుణరుచితో ప్రాంతానికో బిర్యాని ప్రసిద్ధి పొందిదన్నది విధితమే. అలా కడపలో చిట్టి ముత్యాల బియ్యంతో తయారు చేయు బిర్యానికి విశేష ఆదరణ లభిస్తోంది.

ఆ ఆహార నేపథ్యం గూర్చి.కడపలో గుర్తింపు పొందిన పీర్ బాషా గారు నిర్వహణ చేస్తున్న బిస్మిల్లా బిర్యాని శాలలో కార్యక్రమాన్ని చిత్రీకరణ చేయడం జరిగింది.

ఇక్కడ తయారీ ఆసాంతం గమనించిన నేను ఈ బిర్యానీ రూపుదిద్దడం సులువైన విధానం కాదు అని వ్యక్తం చేస్తున్నాను.వ్యయమే కాదు వేడి ఆవహించిన వంటశాలలో గంటల తరబడి ఓర్పుగా ఉండాలి.ఇక నేర్పు చాలా ప్రాముఖ్యం.

తొలుత పొటేలు మాంసంతో ఓరకం మసాలా జోడించి కూర వలే సిద్ద పరిచి ముక్క మెత్తగా మారేలా మసాలా బాగా పట్టేలా నానబెడతారు.

తర్వాత బియ్యంతో వేరొక మసాలా పొందించి సాధా బిర్యాని తయారు చేసుకుని రెండు సమ్మిళిత పరిచి అంతిమ రూపు బిర్యానీ దాల్చిన దరిమిలా వడ్డిస్తారు.

చిట్టి ముత్యాల బిర్యానీ తినడం ఇదే ప్రధమం నేను. తింటున్నప్పుడు కమ్మగా,తిన్నాక బొజ్జలో ప్రశాంతంగా ఉంది.జీర్ణం సజావుగా అయ్యింది.వెరసి సంతృప్తున్ని అయ్యాను.

ఇక నిర్వాహకులు గూర్చి
పీర్ బాషా గారిది వంటలు చేయుటలో అనుభవ శైలి.వై.యెస్.ఆర్.కడప జిల్లాలో వంటల తయారీ రంగాన
వారికి విశేష గుర్తింపు ఉంది. ఆ తరుణంలో ఆహార శాల ప్రారంభించి తమ వద్దకు వచ్చే వారిపట్ల ఆప్యాయంగా వుంటూ శుచితో రుచికరమైన ఆహారం వండి వడ్డిస్తూ ప్రసిద్ధత పొందారు.

ఇచ్చట ఆహార స్వభావాన్ని కార్యక్రమ పరంపరలో సవివరంగా వివరిస్తాను.


చిరునామా:- https://g.co/kgs/EfUqC5

Комментарии

Информация по комментариям в разработке