Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 10-01-2025 |.mov

Описание к видео Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 10-01-2025 |.mov

Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 10-01-2025 |.mov

చేరితిమీ - నీ దివ్య పాదం - మా యేసయ్యా
నీ దివ్య హస్తం - మా మీద ఉంచి - దీవించి నడుపుమా
అబ్రాహాము దేవా ఆశీర్వదించు
ఈసాకు దేవా అభివృద్ధి పరచు
మోషే దేవా మమ్ము నడిపించు
పౌలు దేవా మమ్ము బలపరుచు
ఆశీర్వదించు - మమ్ము అభిషేకించు

1. మా జీవప్రయాణంలో తోడుండుము
మేఘ అగ్ని స్తంభముగా ముందుండి నడుపుము
ఎట్టి అపాయం కలుగకుండా
అంటూ రోగములు నుండి కాపాడుమా
ఆశీర్వదించు - మమ్ము అభిషేకించు

2. పాప శాపముల్ తొలగించుమా
పరలోక దీవెనలు కురిపించుమా
అద్భుత కార్యములన్ జరిగించుమా
సాక్ష్యం పలికే రోజులను దయచేయుమా
ఆశీర్వదించు - మమ్ము అభిషేకించు

3. మా కొరతలను తొలగించుమా
సమృద్ధి సంవత్సరం దయచేయుమా
ఇతరులకు అప్పు ఇచ్చేవారిగా
ఆర్ధిక సమృద్ధి కలిగించుమా
ఆశీర్వదించు - మమ్ము అభిషేకించు

4. అన్నావలె కన్నీళ్లు తుడువుము
సామువేలులాగా మా బిడ్డలను దీవించుమా
బంగారు భవిష్యత్తు దయచేయుమా
దైవ మానవ ఆదరాభిమానం దయచేయుమా
ఆశీర్వదించు - మమ్ము అభిషేకించు

5. శాంతి సమాధానం దయచేయుమా
మా హృదిలో నెమ్మదిని దయచేయుమా
ఆయుష్కాలం పొడిగించుమా
ఆయురారోగ్యం మాకు దయచేయుమా
ఆశీర్వదించు - మమ్ము అభిషేకించు

Комментарии

Информация по комментариям в разработке