సూర్యముని ఇంటిపై వైకాపా మూకల రాళ్ల దాడి | Tadipatri CI Murali Krishna Injured In YCP Stone Attack

Описание к видео సూర్యముని ఇంటిపై వైకాపా మూకల రాళ్ల దాడి | Tadipatri CI Murali Krishna Injured In YCP Stone Attack

అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ధ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన అనుచరులు నిన్న మధ్యాహ్నం తెదేపా అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి వాహనంపై దాడులకు పాల్పడ్డారు. తీవ్ర స్థాయిలో నిన్న రాళ్లదాడి జరిగి పలువురు గాయపడ్డారు. నిన్నటి దాడులను తీవ్రంగా ప్రతిఘటించిన తెదేపా నాయకులు సూర్యముని, ఆయన అనుచరులను లక్ష్యంగా చేసుకొని ఇవాళ వైకాపా మూకలు ఆయన ఇంటిపై రాళ్లదాడికి దిగారు. ఈ రాళ్ల దాడిలో తాడిపత్రి సీఐ మురళీకృష్ణ తలకు రాయి బలంగా తాకడంతో తీవ్ర గాయమైంది.

వైకాపా మూకలు రాళ్లదాడి సంఘటన సమాచారం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి తెదేపా నాయకుడు సూర్యముని ఇంటికి చేరుకొని వైకాపా మూకలను వెంటాడారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి తాడిపత్రిలోని సూర్యముని ఇంటి పోలీస్ స్టేషన్ వద్దకు ర్యాలీగా వెళ్లారు. తాడిపత్రి పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీప్రభాకరెడ్డి తన అనుచరులతో కలిసి, పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఓవైపు జేసీ ఆందోళన జరుగుతుండగా, తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటివైపు దూసుకెళ్లే యత్నం చేశారు. తెదేపా శ్రేణులను అడ్డుకునేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్లారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దఎత్తున తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు జేసీ ఇంటి వద్దకు చేరుకోవడంతో పోలీసులు అందరినీ చెదరగొట్టే యత్నం చేశారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మధ్య జూనియర్ కళాశాల మైదానం ఉండటంతో ఇరువర్గాలు అక్కడ పరస్పర రాళ్లదాడులకు పాల్పడ్డారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి మేడపైకి ఎక్కి వైకాపా మూకలు తెదేపా కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. దీన్ని ప్రతిఘటించడానికి తెదేపా కార్యకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటివైపు దూసుకెళ్లే యత్నం చేస్తున్నారు. పోలీసులు వైకాపా మూకలను అడ్డుకునే యత్నం చేయకుండా కేవలం తెదేపా కార్యకర్తలను అదుపుచేయడంపైనే దృష్టి పెట్టడంతో వైకాపా మూకలు మరింత రెచ్చిపోతున్నాయి.

పోలీసులు నిరంతరాయంగా భాష్పవాయువు గోళాలను పేల్చుతున్నారు. జేసీ ఇంటి ఎదుట కళాశాల మైదానంలో తెదేపా, వైకాపా వర్గీయుల పరస్పర దాడులు, పోలీసుల భాష్పవాయువు ప్రయోగాలతో ఆ ప్రాంతం యుద్ధవాతావరణాన్ని తలపిస్తోంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке