President Droupadi Murmu Inaugurates 'Unmesha' & 'Utkarsh' Festivals at Bhopal 🟥 DD News Telangana

Описание к видео President Droupadi Murmu Inaugurates 'Unmesha' & 'Utkarsh' Festivals at Bhopal 🟥 DD News Telangana

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ వేదికగా జరుగుతున్న ఫోక్‌ ఫెస్టివల్‌ "ఉత్కర్ష్"తో పాటు అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం "ఉన్మేష్"ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం ప్రారంభించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలను సాంస్కృతిక శాఖతో పాటు సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం ఉన్మేష్ ఆసియాలోనే అతిపెద్ద సాహిత్య సదస్సు. బహుభాషా కవితా పఠనం, గిరిజన కవి సమ్మేళనం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌పై కవితా పఠనం, సాహిత్యంపై చర్చలు వంటివి ఇందులో ఏర్పాటు చేశారు. ఈ ఉన్మేష్ ఉత్సవంలో 15 దేశాల నుండి 100 కంటే ఎక్కువ భాషలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 575 మంది పాల్గొంటున్నారు.

Комментарии

Информация по комментариям в разработке