ఊర్మిళాదేవి నిద్ర | Urmila Devi Nidra | Rajan PTSK

Описание к видео ఊర్మిళాదేవి నిద్ర | Urmila Devi Nidra | Rajan PTSK

మన ప్రాచీన జానపద సాహిత్యంలో సీతారాముల పాటలు బోలెడన్ని ఉంటాయి. ఈ పాటల్లో కల్పనలు ఉంటాయి కానీ, అవన్నీ అందంగానే ఉంటాయి. మూలకథకు విరుద్ధం కాకుండా, భక్తిభావంతో చేసే కల్పనా చమత్కారాలు పాఠకులకు రసానందం కలిగిస్తాయి. అటువంటి చమత్కారభరితమైన ఓ కల్పనా సాహిత్యమే ఈ ఊర్మిళాదేవినిద్ర పాట. ఈ పాట రచించిన వారెవ్వరో మనకెవ్వరికీ తెలియదు. కానీ వందలయేళ్ళుగా తెలుగిళ్ళలో పాడుకునే పాట ఇది. మనకు వాల్మీకి రామాయణంలో ఊర్మిళాదేవి లక్ష్మణస్వామికి భార్య అయ్యిందన్న ఒక్క విషయం తప్ప మరే విషయమూ కనిపించదు. అయితే మన తెలుగువారి కథల్లో మాత్రం ఊర్మిళ గురించి ఒక చమత్కారమైన ప్రస్తావన ఉంది. లక్ష్మణుడు అడవికి వెళుతుంటే ఊర్మిళ తాను కూడా వస్తానంటుంది. కానీ లక్ష్మణుడు ఒప్పుకోడు. అప్పుడు ఊర్మిళ పద్నాలుగేళ్ళపాటు తన మెలకువను తన భర్తకిచ్చి అతగాని నిద్రను తాను తీసుకుంటుంది. అలా చేయడం వల్ల భర్త దూరమైనాడనే విరహవేదన అనుభవించనక్కరలేదు కదా. అందుకని అలా చేసింది. ఇక లక్ష్ణణుడికి కూడా అది సంతోషమే. తనకు పద్నాలుగేళ్ళు నిద్ర ఉండదు కనుక, అన్నా వదినలను కంటికి రెప్పలా అనుక్షణం కాపాడుకుంటూ సేవ చేసుకోవచ్చు. పైగా తన భార్య మెలకువ తనతో ఉంది కనుక, ఆమె కూడా తనతో ఉన్నట్టే భావన కలుగుతుంది. ఆ విధంగా సీతారామలక్ష్మణులు తిరిగివచ్చే వరకూ ఊర్మిళ పడుకునే ఉంటుంది. ఈ విషయాన్నే ఇతివృత్తంగా తీసుకుని ఎవరో అజ్ఞాత రచయితో, రచయిత్రో ఈ పాటను రచించారు. ముందుగా మనం ఆ పాటలో ఉన్న కథను చెప్పుకుని ఆపై ఆ పాట సాహిత్యాన్ని కూడా తెలుసుకుందాం. పాట సాహిత్యాన్ని చదువుతూ పాట వినేలా ఈ వీడియో తయారు చేశాను.
Rajan PTSK

Комментарии

Информация по комментариям в разработке