Biden Confused | Calls Trump as Vice President & Ukraine President as Putin | మరోసారి తడబడిన బైడెన్

Описание к видео Biden Confused | Calls Trump as Vice President & Ukraine President as Putin | మరోసారి తడబడిన బైడెన్

అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి తడబడ్డారు. అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రెండోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన బైడెన్‌పై ఇంటాబయట తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


నాటో దేశాల వార్షిక సదస్సు తర్వాత బైడెన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధ్యక్ష రేసు నుంచి మీరు వైదొలగితే కమలా హ్యారిస్ ...ట్రంప్‌ను ఓడించగలరని భావిస్తున్నారా..? అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.అధ్యక్షుడిగా పనిచేసే అర్హత ఉపాధ్యక్షుడు ట్రంప్‌నకు లేకుంటే...ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాణ్నే కాదన్నారు. ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌కు బదులు...ట్రంప్ అని అన్నారు. మీడియా సమావేశానికి ముందు నాటో సభ్యదేశాల ప్రతినిధులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని పరిచయం చేసిన బైడెన్ ...ఆ సమయంలో జెలెన్ స్కీని ఆహ్వానిస్తూ అధ్యక్షుడు పుతిన్ అని సంబోధించారు. దీంతో అక్కడివారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. జెలెన్ స్కీ మాత్రం నవ్వుతూ ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. సమావేశానంతరం వివిధ దేశాధినేతలు బైడెన్ కు మద్దతుగా నిలిచారు. అప్పుడప్పుడు ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు సహజమే అని అన్నారు..
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке