Brahmanandam Autobiography Book | Dr Gurava Reddy

Описание к видео Brahmanandam Autobiography Book | Dr Gurava Reddy

#DrGuruvaReddy #Brahmanandam

బ్రహ్మానందం
ఓ హాస్య శిఖరం 'మాత్రమే'
అనుకునే వాళ్ళకి,
'నేను' అంటూ తనని తానూ పరిచయం చేసే
ఓ 'కవిత్వమే' ఈ పుస్తకం!
నిజమే, ఈ పుస్తకం ఓ కవిత్వమే..!
పుస్తకంలో కథలు,
అవి అల్లడానికి అక్షరాలూ షరా మామూలు!
కానీ ఈ పుస్తకంతో,
జీవితమనే సాగరాన్ని మధించి,
కవితలతో, ఛలోక్తులతో రంగరించి,
అనుభావాల దొంతరలతో అభిషేకించి,
క్షీర సాగర మధనంలా.. జీవిత సాగర మధనంతో
అమృతాన్ని వడ్డించాడు బ్రహ్మానందం!
తనకి తానె సాటి అనే కిరీటాన్ని
మరో సారి మెరుగు పరిచి,
విధ్వత్తు నింపిన వినయంతో,
తిరిగి ఆ మణికిరీటాన్ని ధరించాడు ఈ పుస్తకం తో..!
నేర్చుకోడానికి చాలని జీవితంలో,
చదుకోడానికి దొరకె పుస్తకాలే అదృష్టాలు!
అలాంటి అదృష్టాన్ని, తన బాషా పటిమతో
షడ్రషోపేత భోజనంలా వడ్డిచ్చాడు బ్రహ్మానందం!
నాకెంతో ఇష్టమైన నటుడు, మిత్రుడు బ్రహ్మానందం గురించి
ఎంత చెప్పాలనుకున్నా తనివితీరదు!
తానెవరనేది చెప్పే తగువు, నాలాంటి వారికి లేకుండా,
స్వయంభులా తనని తానె పరిచయం చేసుకొని,
తానెవరిని అందరికి అర్థమయ్యేలా రచించుకొని,
మాలాంటి అభిమానులకి శ్రమని సైతం తగ్గించాడు..!
అది బ్రహ్మానందం అంటే..!
మీరు ఈ పుస్తకం తప్పక చదవండి..
ఓ నిండు జీవితం మిమ్మల్ని సృజిస్తుంది, ఆలోచింపచేస్తుంది.. గురవా రెడ్డి

Комментарии

Информация по комментариям в разработке