అందరి అభిమాన నటులు

Описание к видео అందరి అభిమాన నటులు

జగ్గయ్య గుంటూరు జిల్లాలోని తెనాలికి సమీపంలో దుగ్గిరాల దగ్గర మోరంపూడి అనే గ్రామంలో, 1928 డిసెంబర్ 31న ధనవంతుల కుటుంబంలో జన్మించారు.

కొంగర జగ్గయ్య తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్యగా, "కళా వాచస్పతి"గా పేరుగాంచాడు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ తో సత్కరించింది.

జగ్గయ్య విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాలలో చాలా చురుకుగా ఉండేవాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోషలిస్టు గ్రూపులతో సంబంధాలు కూడా ఉండేవి. వాటిని నిషేధించిన తరువాత జయప్రకాష్ నారాయణ స్థాపించిన ప్రజా సోషలిస్టు పార్టీలో చేరాడు. 1956లోజవహర్‌లాల్ నెహ్రూ పిలుపుకు స్పందించి, తిరిగి కాంగ్రేసులో చేరాడు. 1962 వ సంవత్సరంలో జరిగిన లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్ధిగా జగ్గయ్యను ఎన్నుకున్నారు. ఆ సందర్భంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని కలిశారు. తన లోక సభ అభ్యర్థిత్వాన్ని గురించి నెహ్రూని అడగగా నిజమేనని చెప్పారు. కాని జగ్గయ్య గారిని పోటీ చేయొద్దని చెప్పారు నెహ్రూ. స్వతంత్ర పార్టీ నాయకుడు ఆచార్య రంగా అక్కడి నుండి పోటీ చేస్తున్నారు , అలాంటి నాయకులు పార్లమెంటుకు రావాలి. కనుక పోటీ చేయ వద్దని వారించారు. కాంగ్రెస్ పోటి చేయక పోయినా రంగా గారు కమ్యూనిస్ట్ చేతిలో ఓడి పోతారన్నారు జగ్గయ్యగారు. అయినా పరవా లేదు అంతటి మహానాయకుని ఓటమికి కాంగ్రెస్ కారణం కాకూడదు అని అన్నారు నెహ్రూ. ( ఆ నాటి రాజ కీయ నాయకుల నైతిక విలువలకు ఇదొక మచ్చు తునక ) 1967లో నాలుగవ లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో ఒంగోలు నియోజక వర్గం నుండి కాంగ్రేసు పార్టీ తరుపున పోటీ చేసి గెలిచాడు.
అలా.... జగ్గయ్య గారు లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు అయ్యాడు..
సేకరించిన సమాచారం 🙏

Комментарии

Информация по комментариям в разработке