Enni Shirasulu Nelaralaga l Full Song l Errajenda Song l Arunodaya Nirmala l Y Venkanna l Galam Tv

Описание к видео Enni Shirasulu Nelaralaga l Full Song l Errajenda Song l Arunodaya Nirmala l Y Venkanna l Galam Tv

#YenniShirasulu Nelaralaga l Kamyunijam Udayincheno Full Song l #ArunodayaNirmala Song l #GalamTVSongs #GalamTVChannel #FolkSongs

Lyrics : Y Venkanna (Anveshi)
Singer : Arunodaya Nirmala
Music : Wilson Rudrarapu
DOP&Editing : Aravind Birru
Producer : Dasari Bhaskar
Posters : Dindigala Purushotham

Special Thanks to:
Dr. Vennela Sreenath,
Ajay Parakala,
Manukota Prasad,
Prakash (Y Venkanna Brother)

ఎన్ని శిరసులులు నేలరాలగ
కమ్యూనిజముదయించెనో
ఎన్ని మరణ మృదంగ గోషల
మార్క్సిజము జన్మించెనో..
ఎంత నెత్తురు నేలపారగ
ఎర్రజెండా మెరిసేనో..
ఎందరమరుల త్యాగమూ
మన నక్సలిజమై కదిలెనో

తెలుసుకో తెలుసుకో జన ప్రియతమా
పరిణామమెందరి రక్త తర్పనొ నేస్తమా
!!తెలుసుకో!!

ఆదిలోన అనవాళి
అందరొకటిగా బ్రతుకగా
స్వార్థ చింతన మానవాళిని
సొంత ఆస్తికి నెట్టగా
నీది నాదని భూమిమీద
గెట్టు హద్దులు పుట్టగా
ఆధిపత్యం నుండే దోపిడి
అంకురార్పణ జరగదా

తెలుసుకో తెలుసుకో మిత్రమా
పరిణామమెందరి రక్తతర్పనొ నేస్తమా
!!తెలుసుకో!!

పుడమి పైన పట్టుకొరకు
మృగపు న్యాయము పుట్టగా
జులుముతో బలవంతులే
బలహీనులను వహించగా
అంతరాలా మొదటి మెట్టుగా
బానిసల సృష్టించగా
ఆధిపత్యం నుండే దోపిడి
కంకురార్పణ జరుగగా
తెలుసుకో తెలుసుకో మిత్రమా
స్వార్ధమే సంఘర్షణకు గతి నేస్తమా
!!తెలుసుకో!!

తరతరాలుగ దొరల దోపిడి
ప్రతీ దినము జరగగా
రాజ్యహింసకు లోకమంతా
గొల్లు గొల్లున ఏడ్చెనా
పీడితులపై పెత్తందారుల
ఉక్కుపాదం మోపగా
ఎందరో కన్నీటి గాధల
వీర విప్లవ చరితలే

తెలుసుకో తెలుసుకో మానవా
రేపటి పయన మేందో ఇకనైనా మేలుకో...
!!తెలుసుకో!!

ప్రజల ఆస్తిని కొల్లగొట్టి
దోపిడీ కొనసాగెనా..
మానప్రాణాలెన్నో దోచి
మనుగడే చిది మేసెనా..
పేదల కష్టం దోచి బ్రతుకుట
పెట్టుబడులా సూత్రమా
కలిమిలేముల ఘర్షనే
గతి తార్కిక భౌతిక సూత్రమా

తెలుసుకో తెలుసుకో జన మిత్రమా
సామ్రాజ్యవాదమే పుడమి తల్లికి శత్రువు
!!తెలుసుకో!!
ఎన్ని శిరసులులు నేలరాలగ
కమ్యూనిజముదయించెనో
ఎన్ని మరణ మృదంగ గోషల
మార్క్సిజము జన్మించెనో..
ఎంత నెత్తురు నేలపారగ
ఎర్రజెండా మెరిసేనో..
ఎందరమరుల త్యాగమూ
మన నక్సలిజమై కదిలెనో

Комментарии

Информация по комментариям в разработке