KANCHIPATI GURUMURTHY SMARAKA MOVIE ACTOR I. PRASANNA KUMAR LAUNCHED THE BOOK AAKUPACHANI GNAPAKAM

Описание к видео KANCHIPATI GURUMURTHY SMARAKA MOVIE ACTOR I. PRASANNA KUMAR LAUNCHED THE BOOK AAKUPACHANI GNAPAKAM

ఘనంగా జరిగిన శ్రీ కంచిపాటి గురుమూర్తి స్మారక కార్యక్రమం ముఖ్య అతిథి నంది అవార్డు గ్రహీత ప్రముఖ సినీ నటులు ఐ ప్రసన్న కుమార్
అగనంపూడి సి డబ్ల్యూ సి లో యువకవి వెంకట్ కంచిపాటి ఆధ్వర్యంలో శ్రీ కంచిపేట గురుమూర్తి తృతీయ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథి ఐ ప్రసన్న కుమార్ కీర్తిశేషులు కంచిపాటి గురుమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజల చేసితిరి. అనంతరము ఆయన వెంకట్ కంచిపాటి రచించిన ఆకుపచ్చని జ్ఞాపకం పుస్తక ఆవిష్కరణ చేసితిరి. అనంతరం ఆయన ప్రసంగిస్తూ భావితరాల యువతి యువకులు సమాజంలో అంతరించిపోతున్న కథలు కవితలు పునర్జీవనం చేయుట కొరకు పోటీలు ఏర్పాటు చేసి వారికి సన్మానము నగదు బహుమతి అందజేయడం అభినందనీయమని అన్నారు. కథలు కవితలు మరియు కళలు బ్రతికించడానికి వెంకట్ కంచిపాటి ని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు రావాలని కోరారు.
వెంకట కంచిపాటి మాట్లాడుతూ మా తండ్రిగారైన కంచిపాటి గురుమూర్తి కథలు కవితలు పౌరాణిక నాటకాలు అంటే చాలా ఇష్టమని ఆయన అభిరుచుల మేరకు నేను ఈ రోజున ఆయన పేరుపై స్మార్కంగా
కధ కవిత పోటీలు నిర్వహించడం జరిగిందని ఈ పోటీలకు విశేష స్పందన రావడం జరిగిందని అన్నారు.
కథ కవితల పోటీలో బహుమతి పొందిన ప్రధమ ద్వితీయ తృతీయ వచ్చిన వారికి సన్మానం నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. అగనంపూడి ఉన్నత పాఠశాలలో పదో తరగతి ప్రథమ ద్వితీయ మార్కులు వచ్చిన వారికి కూడా బహుమతులు అందజేయడం జరిగినది.
కథ రచయిత నటులు చెల్లూరి సాంబమూర్తి సభ అధ్యక్షత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ కథ రచయిత దేవులపల్లి దుర్గాప్రసాద్ కొప్పిశెట్టి సూర్యనారాయణ ఐఎఫ్ఎస్సి జాయింట్ సెక్రెటరీ పులగపురి ఆశాలత స్థానిక పెద్దలు బోండా అప్పారావు ఐఆర్సిహెచ్ అప్పారావు మరిసా రామచంద్రరావు సాయన సన్యాసిరావు వరహాలు పైడ్రాజు పూర్ణచంద్రరావు సిపాన రమేష్ బాబు గొర్ల శ్రీనివాసరావు పట్టా రమేష్ బండారు చందు రమేష్ వడ్డాది శీను పెద్దిరెడ్డిల నీలకంఠ కవులు నటులు రచయితలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

Комментарии

Информация по комментариям в разработке