మాది మంచి ప్రభుత్వం... మెతక ప్రభుత్వం కాదు ||

Описание к видео మాది మంచి ప్రభుత్వం... మెతక ప్రభుత్వం కాదు ||

ఏలూరు జిల్లా ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామంలో దీపం-2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గత ప్రభుత్వ సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం ఇస్తామన్న మాటను అమలు చేస్తున్నాం
ఆడబిడ్డల రక్షణకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం
వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలోనూ... బయట చేస్తున్న ప్రతి ఆగడంపైనా నిఘా ఉంది
వైసీపీ నాయకులకు చింత చచ్చినా పులుపు చావడం లేదు
మహిళలు, ఆడబిడ్డలపై నోరు పారేసుకునే ప్రతి ఒక్కరికీ కఠిన శిక్షలు తప్పవు
వైసీపీ నాయకుడి నుంచి ఆయన సోదరి రక్షణ కోరితే భద్రత కల్పిస్తాం
అధికారులు ప్రభుత్వానికి పేరు తెచ్చేలా పనిచేయాలి
సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాను
సనాతన ధర్మ పరిరక్షణకు పార్టీలో ‘నారసింహ వారాహి గణం’ విభాగం ఏర్పాటు

స్వామి వారి మీద ఆన

వైసీపీ నాయకులను ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వారి నోళ్లు ఆగడం లేదు. వారికి అవి కూడా రాకుండా భవిష్యత్తులో చేస్తే తప్ప వారు మళ్లీ మారరు. నన్ను విమర్శించే వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. నేను త్రికరణ శుద్ధిగా ప్రజల కోసం పని చేస్తున్నాను. నన్ను ఏ కారణం లేకుండా తిట్టేవారికి, నన్ను అకారణంగా నోటికొచ్చినట్లు విమర్శించే వారికి చెప్పేదొక్కటే. స్వామి వారి మీద ఆన... నేను మిమ్మల్ని చూసుకుంటాను. నాకు సద్విమర్శలు అంటే ఇష్టం. ఓ వ్యక్తి మీద చేసే విమర్శ - హుందాగా స్వీకరించేంత గొప్పగా ఉండాలి. కానీ వైసీపీ నాయకులు మాత్రం నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడుతున్నారు. వాళ్లకు నోళ్లు బాగా ఎక్కువయ్యాయి.
మాది మంచి ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు.. ఎక్కువతక్కువ మాట్లాడితే తొక్కి పట్టి నార తీస్తాం జాగ్రత్త. నేను ముందుగా చెప్పినట్లుగా మీకు యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం.. గొడవ కావాలంటే గొడవే ఇస్తాం. అయితే ఆ గొడవ అభివృద్ధికి ముందడుగు కావాలి.. ఆ యుద్ధం రాష్ట్ర క్షేమం కోసం కావాలన్నదే నా అభిమతం.

వాళ్ళది ఖర్మ పోరాటం

ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఆడబిడ్డల మీద దారుణాలపై వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సాంకేతికత పెరుగుతోంది కానీ... దానికి తగినట్లుగా సోషల్ మీడియాను ఉపయోగించుకొని తప్పులు చేస్తున్న వారికి తగిన శిక్షలు పెరగాలి. త్వరలో డిజిటల్ ప్రైవసీ యాక్ట్ రాబోతోంది. అయితే దానికంటే ముందే తగిన కఠిన శిక్షలు పడాలన్నది నా ఆకాంక్ష. ఎవరు తప్పు చేసినా ఊరుకోవద్దు. ప్రతి నేరం రికార్డు అవ్వాలి. అలాంటి వారికి తగిన శిక్ష పడాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశం. అలాకాదు.. తప్పు చేసినా మా వాళ్లను ఏ అనకూడదు అని వైసీపీ వాళ్లు పోరాటాలు చేస్తాం.. రాస్తారోకోలు చేస్తాం అంటే ఊరుకోబోం. మేం గతంలో మీ రౌడీ రాజ్యం మీద మేం చేసింది ధర్మపోరాటం.. ఇప్పుడు మీది ఖర్మపోరాటం. చట్టం నుంచి మీరు తప్పించుకోలేరు. మేం ఆడబిడ్డల రక్షణ కోసం బలంగా నిలబడతాం. గత ప్రభుత్వ పాలకుడి సొంత చెల్లెలు ఆయన నుంచి రక్షణ కోరుతున్నారు. ఓ మహిళగా, ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమెకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఆమె తన భద్రతపై ప్రభుత్వానికి తగిన అర్జి పెట్టుకుంటే, దానికి అనుగుణంగా ఆమె రక్షణను కల్పించే బాధ్యతను మేం తీసుకుంటాం.

అధికారులు తీరు మార్చుకోవాలి

రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారులు కూడా తీరు మార్చుకోవాలి. మీకు వైసీపీ హయాంలో హనీమూన్ కాలం అయిపోయింది. ప్రజల కోసం నీతిగా, నిజాయతీగా పనిచేయాలనే కూటమి ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడు మీరు పనిచేయండి. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. ఇప్పుడు ధర్మబద్ధంగా పనిచేయాలని కోరుతున్నాం. ఇది కొందరికి నచ్చడం లేదు. పోలీసు వ్యవస్థలో పై అధికారుల నుంచి సీఐ స్థాయి అధికారుల వరకు ఇంకా పాత ప్రభుత్వ విధానంలోనే కొనసాగుతున్నామనే భ్రమ నుంచి బయటకు రండి. చాలామంది అధికారులు వైసీపీ నాయకులు పెద్ద తప్పులు చేసినా మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే మాత్రం ఎంతటి అధికారిపైన అయినా కఠిన చర్యలు తప్పవు. అధికారులు తీరు మార్చుకుంటే అది అందరికీ మేలు చేస్తుంది.

పార్టీలో నూతనంగా ‘నారసింహా వారాహి గణం’ ప్రత్యేక విభాగం

నేను అన్ని మతాలను గౌరవిస్తాను. నా మతాన్ని ఆరాధిస్తాను. నేను సనాతన ధర్మం గురించి మాట్లాడితే దాని గురించి కొందరు విమర్శిస్తారు. నేను సచ్చీలంగా నమ్మే ధర్మానికి తప్పు జరిగితే మాట్లాడటం కూడా తప్పు అన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆలయాలకు వెళ్లే సమయంలో, దర్శన సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని నా దృష్టికి వచ్చింది. దీనిపై రాష్ట్రంలోని అన్ని ఆలయ అధికారులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆలయాలకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి. పోలీస్ ఔట్ పోస్టులు ఏర్పాటు చేయాలి. అలాగే చెప్పులు వేసుకొని ఆలయాల్లో తిరగడం మానుకోవాలి. నేను నమ్మే ధర్మం పట్ల నిర్భయంగా మాట్లాడతాను. దానికి విఘాతం కలిగితే స్పందించడం కనీస ధర్మం. దీనికి కొందరు నన్ము హిందూవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రతి మతాన్ని ప్రేమిస్తాను. నా దగ్గర ఉన్న సిబ్బంది కూడా అన్ని మతాలకు సంబంధించిన వారే. బంగ్లాదేశ్ లో హిందువులకు ఇబ్బంది కలుగుతుంటే చూస్తూ ఉండలేం. అక్కడి హిందువుల ఊచకోతకు గురవుతున్నా స్పందించవద్దు అంటే ఎలా..? దీనిపై సగటు హిందువులకు చైతన్యం రావాలి.. ప్రతి హిందువూ సనాతన ధర్మానికి విఘాతం కలిగితే స్పందించాల్సిన బాధ్యత ఉంది. సనాతన ధర్మాన్ని తిడుతూ, ఇష్టానుసారం సోషల్ మీడియాలో మాట్లాడే వారిపైనా తగిన చర్యలు ఉంటాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రత్యేక విభాగంగా సనాతన ధర్మ పరిరక్షణ విభాగం ఏర్పుటు చేస్తున్నాను. ఈ విభాగానికి ‘నారసింహ వారాహి గణం’గా నామకరణం చేస్తున్నాను. ఈ ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాలని శ్రీ లక్ష్మినరసింహుడి పాదల చెంత నిర్ణయం తీసుకున్నాను’’ అన్నారు.

#Freegas #NDA #eluru #DeputyCM

Комментарии

Информация по комментариям в разработке