దీపావళి గ్రహణం రోజున ఏమి చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు?

Описание к видео దీపావళి గ్రహణం రోజున ఏమి చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు?

దీపావళి గ్రహణం రోజున ఏమి చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు?

https://cutt.ly/qBUuoYC

శ్రీ శక్తిపీఠ మహాక్షేత్రం 25/10/2022 మధ్యాహ్నం 3:00 గం|| నుండి సాయంకాలం 6:30 గం|| వరకు

ఆశ్వయుజ అమావాస్య (దీపావళి) నాడు రాబోవు సూర్య గ్రహణము ప్రత్యేకమైన శక్తి కలిగినటువంటిది. ముఖ్యంగా మంగళవారం రాహుకాలం, అమావాస్య గ్రహణ సమయంలో చేసే శ్రీ అధర్వణ ప్రత్యంగిరా మహాకాళీ దేవి మంత్ర హోమ సాధన చాలా మహత్తరమైన ఫలితములను కలిగిస్తుంది. మహాతీవ్ర స్వరూపిణి, క్రోధమూర్తి అయిన శ్రీ అధర్వణ ప్రత్యంగిరా మహాకాళీ దేవి అన్ని విధములైన శత్రు బాధలను, ప్రయోగ బాధలను, నవగ్రహ దోషములను, వంశానుగత శాపములను, సర్పదోషములను, సంతానలేమిని, అనారోగ్యములను, మృత్యుగండములను, ఆర్ధిక బాధలను, కుటుంబ సమస్యలను, వివాదములను, నరదృష్టిని తొలగించి భక్తులకు నిత్య రక్షణను, ఐశ్వర్యములను, దీర్ఘాయురారోగ్యములను, చతుర్విధ పురుషార్ధములను ప్రసాదిస్తుంది.

25/10/2022 మంగళవారం అమావాస్య నాడు పరమ పూజ్యులు, నడిచే దైవం, పరమహంస పరివ్రాజకాచార్యులు, కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామి వారి దివ్య సమక్షంలో, శ్రీ శక్తిపీఠాధీశ్వరి, మంత్ర మహేశ్వరి మాతాజీ శ్రీ రమ్యానందభారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో శ్రీ శక్తిపీఠ మహాక్షేత్రంలో పరమ పూజ్యశ్రీ స్వామివారు ఆవాహన చేసే శ్రీ అధర్వణ ప్రత్యంగిరా మహాకాళీ దేవికి వేయి కిలోల (1000 కిలోలు) సుమారు పది లక్షల (10,00,000) మిరపకాయలతో అతి విశిష్టమైన మంత్రహోమం జరుగును. ఎంతో అరుదైన ఈ మహాకార్యక్రమంలో భక్తులు పాల్గొని గురువుల, దేవతల అనుగ్రహమును పొందగలరు.

కార్యక్రమ నిర్వహణ: కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరీ పీఠ ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ మాచవోలు రమేష్ శర్మ

9160455255 | 7737928773


Website : http://www.siddheswaripeetham.org/
Facebook :   / siddheswarananda-bharati-swamy-16128905073...  
Phone: +91 9063701687.

© 2022 Sri Siddheswari Peetam

Комментарии

Информация по комментариям в разработке