#cmjagan #bcyparty #ramachandrayadav
జగన్ అడ్డాలోనే అవినీతిపై బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ ఫిర్యాదు
రాష్ట్రంలో అతి పెద్ద ఆర్థిక నేరస్తుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధినేత బొడె రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. జగన్ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు అంశాలను ప్రస్తావిస్తూ రామచంద్ర యాదవ్ ఇవేళ విజయవాడ నుండి పులివెందులకు ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేశారు. అనంతరం రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జగన్ సర్కార్ అవినీతి, దోపిడీ వ్యవహారాలపై ప్రాథమిక సమాచారం, కొన్ని కీలక అంశాలతో పులివెందుల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు అందించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా పులివెందుల సంస్కృతి అంటూ ఈ పులివెందుల ప్రాంతానికి చెడ్డపేరు తీసుకువస్తున్నారని ఇటు వంటి వ్యక్తిని పులివెందుల, కడప నుండి తరిమివేయాలన్నారు. రాష్ట్రంలోని ఏ వర్గానికి మంచి చేయకపోగా, ఏ ఒక్క రంగంలో రాష్ట్రాన్ని అబివృద్ధి చేయకపోగా, నాలుగున్నరేళ్లుగా రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ, దోపిడీ చేశారని ఆరోపించారు రామచంద్ర యాదవ్. వైసీపీ కార్యకర్త మొదలు కొని ముఖ్యమంత్రి వరకూ ఈ రాష్ట్రం మొత్తం వాళ్ల అబ్బసొమ్ము అన్నట్లుగా దోపిడీ చేసే కార్యక్రమం చేశారని మండిపడ్డారు.
లక్షా 65వేల కోట్ల అవినీతి ఇలా
మధ్యం ద్వారా సుమారు రూ.50వేల కోట్లకుపైగా దోపిడీ చేశారని పేర్కొన్న రామచంద్ర యాదవ్..బాక్సయిట్, లాటరైట్ మరియు గ్రానైట్ ద్వారా సుమారు రూ.30వేల కోట్లు, ఇసుక తవ్వకాల ద్వారా రూ.12వేల కోట్ల అవినీతి, పారిశ్రామిక భూములు, చుక్కల భూముల పేరుతో రు.20వేల కోట్లు, నీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు 9వేల కోట్లు, ఎర్రచందనం ద్వారా రూ.15వేల కోట్లు, విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్ల ద్వారా రూ.10వేల కోట్లు, పోర్టుల ద్వారా సుమారు 5వేల కోట్లు, అమూల్, బైజూస్ ఇతర కమీషన్ల ద్వారా 2వేల కోట్లు, సినీ పరిశ్రమలలో ప్రొడ్యూసర్ ల నుండి రూ.2వేల కోట్లు ఇలా మొత్తంగా అన్ని కలిపి రూ.లక్షా 65 వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు.
పులివెందుల నియోజకవర్గాన్ని, కడప జిల్లాని, రాష్ట్రాన్ని అబివృద్ధి చేస్తారని ఈ ప్రాంతానికి చెందిన లక్షా 30వేల మంది ఓట్లు వేసి జగన్ ను గెలిపిస్తే లక్షా 65వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ఇక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదన్న విషయాన్ని పులివెందుల ప్రజలు గుర్తించాలన్నారు. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించలేదనీ, కేవలం శంకుస్థాపనల వరకే పరిమితం అయ్యారని విమర్శించారు. ఇక్కడ భూవ్యాపారం చేయడం కోసమే ఉక్కు ఫ్యాక్టరీని ఉపయోగించు కుంటున్నారు తప్ప ప్యాక్టరీ ప్రారంభానికి ఏ మాత్రం కృషి చేయలేదన్నారు. పులివెందుల, కడప జిల్లాకు జగన్ చేసింది ఏమి లేదన్నారు. రాజకీయాలకు అడ్డువస్తే ఎంతటి దుర్మార్ఘమైనా జగన్ చేస్తారని ఈ ప్రాంత ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలుసున్నారు. అందుకు ఉదాహరణగా వివేకానంద రెడ్డి హత్య కేసును గుర్తు చేశారు. ఆయన మనస్థత్వం తెలిసి సొంత తల్లి, సొంత చెల్లి ఈ రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రంలో తలదాచుకున్నారు అంటే ఈయన ఎంత దుర్మార్ఘుడో ఈ ప్రాంత ప్రజలు తెలుసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాదిరిగా అవినీతి, అక్రమాలు చేశారనీ, అంతకు ముందు తన తండ్రి అదికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని వేల కోట్లు దోపిడీ చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు. ఒక మార్పు కోసం, ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ఏర్పడిన బీసీవై పార్టీ ఈ ప్రాంత ప్రజల కోసం ఒక మంచి నాయకుడిని ఇస్తుందని, వారికి మద్దతు ఇవ్వాలని కోరారు.
అడుగడుగునా ఘన స్వాగతం
విజయవాడ నుండి పులివెందులకు రోడ్డు మార్గంగా బయలుదేరిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. గుంటూరు, చిలకలూరిపేట, ఒంగోలు, కందుకూరు, బద్వేలు, కడపలో బీసీవై పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు రామచంద్ర యాదవ్ కు స్వాగతం పలికారు. పలువురు నేతలు పులివెందుల వరకూ వాహనాల్లో అనుసరించారు.
Информация по комментариям в разработке