ప్రజ్ఞానం బ్రహ్మ | Episode -141 సూఫీవేదాంతదర్శము_అంతర్జాల సదస్సు | 28th Sep 2024 |

Описание к видео ప్రజ్ఞానం బ్రహ్మ | Episode -141 సూఫీవేదాంతదర్శము_అంతర్జాల సదస్సు | 28th Sep 2024 |

SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM
షష్ఠ పీఠాథిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంతదర్శమే “#ప్రజ్ఞానంబ్రహ్మ”
#PragnanamBrahma #SufiVedantaDarsamu
Author: Kavisekhara Dr.Umar Alisha, 6th Head of the institution
"ప్రజ్ఞానం బ్రహ్మ" ఎపిసోడ్ - 141
వక్తలు :
1. చిరంజీవి పటాని ఉమా జితేంద్ర.రాజపూడి
2. శ్రీ యర్రంశెట్టి ఉమేశ్ కుమార్, బల్లిపాడు

291 వ పద్యము
సగరుని పుత్రు లాకపిలుఁ జంపుటకై చనుదేర వారలన్
దెగడక కన్నులన్ దెఱచి ధిక్కృతిఁ జూచిన మండి బూడిదై
యెగసి రదే త్రికాలములనేని జయించు మనోబలంబునం
దగపడు నగ్ని భౌతిక మహాగ్నికి సృష్టికి హేతు వారయన్.

292 వ పద్యము
ఒకఁడు జయించె మృత్యువును నొక్కఁడు మృత్యువుఁ జూచినాడు నిం
కొకఁడు జరాభరంబు నవయౌవనమట్టుల మార్చినాఁడు నో
ర్తుక నిజనాథు ప్రాణములతోఁ జని క్రమ్మరఁ దెచ్చి యిచ్చె నీ
ప్రకరణముల్ నిజార్థ ప్రతిపాదకముల్ తను గన్నవారికిన్.

ఓం శ్రీ సద్గురుభ్యో నమః
సూఫీ వేదాంతదర్శము

శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము షష్ఠ పీఠాధిపతులు డా.ఉమర్ ఆలీషా వారు #తత్త్వవేత్త . వీరు రచించిన #సూఫీవేదాంతదర్శము గొప్ప తత్త్వసంహిత. పాఠకుల హృదయంలో మరో #భగవద్గీత రూపంలో చిరస్థాయిగా నిలిచిన ఉద్గ్రంథం. పరమాత్మ స్వరూపమును అంతటా చూడడం కోసం వివిధ సాధనామార్గాలను ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు. తన మోక్షము తన చేతుల్లోనే ఉంది, దాన్ని సులువుగా అందేలా చేయడమే ఈ గ్రంథం యొక్క ముఖ్యాశయము. ఈ సృష్టిలో ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే వివేకాన్ని కలిగించి మనస్సుకు స్థిరత్వాన్ని కలుగజేస్తుంది ఈ గ్రంథము.
ప్రస్తుత ఆధునిక జీవన విధానాన్ని గడుపుతున్న మనందరికీ ఈ పద్యాలు చక్కని మార్గనిర్దేశకాలు. ఆనందకరమైన తాత్త్వికజీవనాన్ని గడిపే విధంగా మనలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం సాయంత్రం 7 గం.లకు సూఫీవేదాంతదర్శము పద్యాలను సులువుగా అర్ధం చేసుకొనే విధముగా #ప్రజ్ఞానంబ్రహ్మ అనే ఈ సదస్సును సద్గురువర్యుల దివ్యాశీస్సులతో నిర్వహించుకుంటున్నాము.

Dr.Umar Alisha, 9th head of the institution.
Pithapuram, Andhra Pradesh, INDIA
---------------------------------------------------------------------------------------
More information at the following websites,
http://www.sriviswaviznanspiritual.org
http://www.uardt.org
---------------------------------------------------------------------------------------
Official Social Profiles :

Facebook :
  / svvvap1472  
  / uardt  
  / drumaralisha  

Instagram :
  / svvvap1472  
  / uardt2000  
  / drumaralisha  

Twitter :
  / svvvap1472  
https://x.com/uardt2000
  / drumaralisha  

Sathguru Tatvam - Youtube Video Channel
   / sathgurutatvam  
   / @uardt  

Комментарии

Информация по комментариям в разработке