Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть భర్తృహరి సుభాషితాలలో ఏముంది? | Bhartruhari | Rajan PTSK

  • Ajagava
  • 2025-02-04
  • 8960
భర్తృహరి సుభాషితాలలో ఏముంది? | Bhartruhari | Rajan PTSK
BhartruhariSubhashitaluNeetiSatakamTeluguLiteratureSanskritSubhashitasMoralPoemsBhartruhariNeetiSatakamTeluguDharmaNitiSuktuluTeluguPoetrySanskritPoetryBhartruhariNeetiTeluguSahityamభర్తృహరినీతి శతకంతెలుగు సాహిత్యంసంస్కృత సూభాషితాలునీతి సూక్తులుభర్తృహరి నీతి శతకంతెలుగు కవిత్వంధర్మంNeeti SatakamMoral poemsఏనుగు లక్ష్మణకవిఆరంభింపరు నీచ మానవులుbhartruhariBhartrihariBhartrhariIndian Philosophical poemsSanskrit moral poemsbest slokas
  • ok logo

Скачать భర్తృహరి సుభాషితాలలో ఏముంది? | Bhartruhari | Rajan PTSK бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно భర్తృహరి సుభాషితాలలో ఏముంది? | Bhartruhari | Rajan PTSK или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку భర్తృహరి సుభాషితాలలో ఏముంది? | Bhartruhari | Rajan PTSK бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео భర్తృహరి సుభాషితాలలో ఏముంది? | Bhartruhari | Rajan PTSK

భర్తృహరి సుభాషితాలు అనే మాట విననివారుండరు. ఈ భర్తృహరికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. చంద్రగుప్తుడనే బ్రాహ్మణుడికి నలుగురు భార్యలని, వారిలో బ్రాహ్మణ స్త్రీకి వరరుచి, క్షత్రియకాంతకు విక్రమార్కుడు, వైశ్యవనితకు భట్టి, శూద్ర పడతికి భర్తృహరి జన్మించారన్నది ఒక కథ. అలానే భర్తృహరి తన భార్య జారతనం వల్ల హతాసుడై వైరాగ్య భావన పొందాడనే మరో కథ కూడా ప్రచారంలో ఉంది. కానీ ఈ కథలకు ప్రామాణికత్వం లేదు. అందువల్ల ఇవి కచ్చితంగా నిజాలే అని చెప్పడానికి లేదు. అయితే భర్తృహరి తన రచనల్లో పేర్కొన్న విషయాలను బట్టి, ఇతర కవుల రచనలను బట్టి, మరీ ముఖ్యంగా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం భారతదేశాన్ని సందర్శించిన ఈజింగ్ అనే చైనాయాత్రికుడి రచనలను బట్టి ఇలా ఎలా చూసినాసరే ఈ భర్తృహరి కనీసం 1500 సంవత్సరాలకు క్రితంవాడన్న విషయం మాత్రం కచ్చితం చెప్పొచ్చు.

భర్తృహరి రచనల్లో మూడు గ్రంథాలు చాలా ప్రసిద్ధిని పొందాయి. వాటిల్లో ఒకటి.. వాక్యపదీయం. పతంజలి భాష్యానికి వ్యాఖ్యానంగా వ్రాయబడిన వ్యాకరణ గ్రంథమిది. ఇది బ్రహ్మకాండ, వాక్యకాండ, పదకాండ అని మూడు భాగాలుగా ఉంటుంది. అలానే భట్టికావ్యం అనే మరో రచన కూడా చాలా ప్రసిద్ధి చెందింది. రామాయణ కథను 1650 శ్లోకాలలో చెప్పిన రచన ఇది. అయితే యుద్ధకాండతోనే ఈ గ్రంథాన్ని ముగించేశాడు భర్తృహరి. బహుశా ఉత్తరకాండను భర్తృహరి ప్రామాణికంగా తీసుకుని ఉండకపోవచ్చు.

ఈ భట్టి కావ్యాన్ని.. భట్టి అనే పేరుగల కవి వ్రాశాడని, భర్తృహరి భట్టి వేరువేరనీ అన్నది కొందరు పండితుల అభిప్రాయం, అయితే అధికశాతం పండితులు, పరిశోధకులు మాత్రం ఈ భట్టికావ్యం రచించింది భర్తృహరే అని నిర్ధారణ చేశారు. ఇక సుభాషిత త్రిశతిగా పిలుచుకునే నీతి, శృంగార, వైరాగ్య శతకాలు మూడింటికీ చెప్పలేనంత ప్రఖ్యాతి ఉంది. భర్తృహరి సుభాషితాలను ఏనుగు లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మన, ఎలకూచి బాలసరస్వతి మొదలైన వాళ్ళు తెలుగులోకి అనువదించారు.

సుభాషితి త్రిశతిలోని నీతి శతకంలో భర్తృహరి ఏ ఏ పనులు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో, స్నేహితులు ఎలా ఉండాలో, కార్యసాధకుడి లక్షణాలేమిటో, దైవం ఎంత చిత్రమైనదో, ఉన్నత వ్యక్తిత్వం కలవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఇలా అనేక విషయాల గురించి చక్కని ఉదాహరణాలతో వివరిస్తాడు.

ఇక శృంగార శతకంలో అయితే.. వయస్సులో ఉన్నవారికి ఉద్రేకం కలిగించే విషయాల గురించి, మనస్సును అదుపులో ఉంచుకొనే మార్గాల గురించి చెబుతాడు.

అలానే వైరాగ్య శతకంలో.. లోభాన్నీ, కోరికలను పోగొట్టుకోవడం ద్వారా పొందే మనశ్శాంతికంటే గొప్పది వేరేదీ లేదంటాడు. రాజుకంటే కూడా వైరాగ్యభావనకల సన్యాసే గొప్పవాడంటాడు. ఇలా వేదాంతాన్ని అద్భుతమైన రీతిలో ఈ వైరాగ్య శతకంలో నిక్షిప్తం చేశాడు భర్తృహరి.

ఈ విధంగా ఈ మూడు శతకాలలో మనిషి జీవితానికి అవసరమైన ఎన్నో విషయాలను చాలా అందమైన రీతిలో చెప్పాడు భర్తృహరి. ఈరోజు మనం భర్తృహరి నీతిశతకంలోని సుభాషితాల గురించి చెప్పుకుందాం. సులభంగా అర్థం కావడానికి శ్లోకాలను అవసరమైన చోట పద విభాగం చేస్తూ చదువుతాను.

#Bhartruhari #భర్తృహరి #subhashitani

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]