Sai Gurukulam Episode1303 //శ్రీ సాయి సజీవ స్పర్శను ఇప్పటికీ అనుభవిస్తున్న ఔరంగబాద్కర్ కుటుంబం.

Описание к видео Sai Gurukulam Episode1303 //శ్రీ సాయి సజీవ స్పర్శను ఇప్పటికీ అనుభవిస్తున్న ఔరంగబాద్కర్ కుటుంబం.

Sai Gurukulam Episode1303 //శ్రీ సాయి సజీవ స్పర్శను ఇప్పటికీ అనుభవిస్తున్న ఔరంగబాద్కర్ కుటుంబం.

శ్రీసాయి సచ్చరిత్ర 36వ అధ్యాయంలో శ్రీసఖారాం తాత్యాజీ ఔరంగాబాద్‌కర్, అతని భార్య గంగూబాయిలకు బాబా సంతానాన్ని అనుగ్రహించిన అద్భుత లీల ఇవ్వబడింది. 
ఔరంగాబాద్‌కర్ పూర్వీకుల గృహం షోలాపూరులో ఉంది. వంశపారంపర్యంగా ఆ కుటుంబీకులు ఆ గృహమందే నివసిస్తుండేవారు. వాళ్ళు వృత్తిరీత్యా స్వర్ణకారులు. షోలాపూరులోని మంగళవారపేటలో సఖారాంకి ఒక నగల దుకాణం ఉండేది. అతను రెడీమేడ్ ఆభరణాలు తయారుచేయడంలో ప్రసిద్ధుడు. ఆ రోజుల్లో ఎవరికైనా తమకు కావలసిన ఆకృతిలో ఆభరణాలు కావాలంటే అందుబాటులో ఉండేవి కాదు. అందువల్ల వాళ్ళు సఖారాం వద్దకు వచ్చి, తమకు కావలసిన రీతిలో ఆభరణాలు తయారుచేసి ఇవ్వమని అడిగేవారు. అతను తనకున్న నైపుణ్యంతో ఆభరణాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దేవాడు. ఆ రోజుల్లో బ్యాంకులు ఉండేవి కాదు. కాబట్టి నగలను కుదువ పెట్టుకొని డబ్బు ఇచ్చే వ్యాపారం కూడా చేస్తుండేవాడు సఖారాం. అతని గొప్ప వ్యక్తిత్వానికి, నీతి, నిజాయితీలకి తగిన గౌరవం లభించేది. సఖారాం ప్రతిరోజూ సాయంత్రం తన పనులు ముగించుకొని ఇంటికి వచ్చి ఒక ఊయలలో కూర్చొని భక్తిశ్రద్ధలతో విష్ణుసహస్రనామం పఠించేవాడు.

ఇలా కాలం గడుస్తుండగా, ఒకసారి దాసగణు షోలాపూరులో కీర్తన చేశాడు. ఆ కీర్తన కార్యక్రమానికి గంగూబాయి, ఆమె కుటుంబం హాజరయ్యారు. బాబా యొక్క దైవత్వం గురించి, భక్తుల కోసం బాబా చేసిన అనేక లీలల గురించి, బాధితులపట్ల వారి కరుణ గురించి దాసగణు ఎంతో మనోరంజకంగా చేసిన కీర్తన ఆమెపై తీవ్రప్రభావాన్ని చూపి, ఆమె మనసు బాబాపట్ల విశ్వాసంతో నిండిపోయింది. కీర్తన ముగిసిన తర్వాత ఆమె దాసగణుని కలిసి బాబా గురించి వివరాలు అడిగింది. ఆమె గురించి తెలుసుకున్న దాసగణు, “శిరిడీ వెళ్లి బాబా పాదాల వద్ద సాష్టాంగపడు. నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది” అని భరోసా ఇచ్చాడు.  ఆమె క్షణమైనా ఆలస్యం చేయకుండా శిరిడీ వెళ్ళడానికి భర్త నుండి అనుమతి తీసుకొని, తన సవతి కొడుకు విశ్వనాథ్‌ను తోడుగా వెంటబెట్టుకొని బాబా దర్శనానికి ప్రయాణమైంది

శిరిడీ చేరుకున్న గంగూబాయి మసీదులో బాబా ఒంటరిగా ఉన్నప్పుడు దర్శించుకుని తన మనసులోని కోరికను తెలుపుకోవడానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ బాబా వద్ద ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటుండటంతో తన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. దాంతో ఆమె, “బాబాతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం నాకెప్పుడు వస్తుంది? వారికి నా మనోగతాన్ని ఎలా తెలియజేయాలి?” అంటూ చింతించసాగింది. గంగూబాయి, విశ్వనాథ్‌లిద్దరూ బాబా సేవ చేసుకుంటూ శిరిడీలో రెండు నెలలున్నారు. చివరికి ఆమె షామా సహాయం కోరి అతనితో తన మనోగతాన్ని చెప్పి, “బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి సమయం చూచి మీరైనా నా మనసులోని కోరికను బాబాకు విన్నవించండి. అది కూడా బాబా చుట్టూ భక్తులు లేనప్పుడు, వారు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరూ వినకుండా చెప్పాలి” అని వేడుకుంది. అప్పుడు షామా ఆమెతో, “ఈ మసీదు ఏ సమయంలోనూ ఖాళీగా ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు బాబా దర్శనానికి వస్తూనే ఉంటారు. ఈ సాయి దర్బారు ఎల్లప్పుడూ తెరచే ఉంటుంది. ఇక్కడ ఎవరికీ ఏ ఆటంకమూ లేదు. అయినా ఒక మాట చెప్తాను గుర్తుంచుకో! ప్రయత్నించటం నా పని, ఫలితాన్నిచ్చేది మాత్రం కీర్తిదాత, మంగళప్రదుడు అయిన బాబానే! చివరకు సుఖాన్ని కలిగించేది వారే. కనుక నీ చింత ఉపశమిస్తుంది. బాబా భోజనానికి కూర్చున్నప్పుడు, నీవు ఒక టెంకాయను, అగరువత్తులను చేతపట్టుకుని, సభామండపంలో రాతిమీద కూర్చో! బాబా భోజనమయ్యాక, వారు ఉల్లాసంగా ఉన్నప్పుడు చూసి నేను నీకు సైగ చేస్తాను. అప్పుడు నువ్వు పైకి రా!” అని చెప్పాడు. షామా చెప్పినట్లే గంగూబాయి వేచి ఉండగా శుభఘడియ రానే వచ్చింది.

ఒకరోజు బాబా భోజనం పూర్తిచేసి తమ చేతులు కడుక్కున్న తరువాత షామా వస్త్రంతో వారి చేతులు తుడవసాగాడు.  తరువాత బాబా వెళ్ళి తమ ఆసనంపై కూర్చోగానే, షామా గంగూబాయికి సైగ చేశాడు. ఆ శుభసమయం కోసమే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న గంగూబాయి వెంటనే లేచి గబగబా మెట్లెక్కి బాబా ఎదుటికి వచ్చి వినమ్రంగా నిలుచుని, వారికి కొబ్బరికాయను అర్పించి, వారి పాదపద్మాలకు వందనం చేసింది. బాబా ఆ కొబ్బరికాయను తమ చేతులతో గట్టిగా కఠడాపై కొట్టి, “షామా! ఈ కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తుంది. ఇది ఏమంటోంది?” అని అన్నారు. షామా ఆ అవకాశాన్ని అందుకుని, “తన గర్భంలో కూడా ఇట్లే చప్పుడు అవ్వాలని ఈ స్త్రీ తన మనసులో కోరుకుంటోంది. ఆమె కోరిక తీరాలి. ఆమె మనసు మీ చరణాలయందు లగ్నమవ్వాలి, ఆమె సమస్య తీరుగాక! ఆమెననుగ్రహించి కొబ్బరికాయను ఆమె ఒడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో ఆమె కడుపు పండి కొడుకులు, కూతుళ్లూ కలుగుతారు” అని అన్నాడు. అప్పుడు బాబా అతనితో, “కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా? ఇలా వెఱ్ఱిగా ఎందుకనుకుంటారు? జనానికి పిచ్చిపట్టినట్లు అనిపిస్తోంది” అని అన్నారు. అందుకు షామా, “మాకు తెలుసు. మీ మాటల ప్రభావంతో పిల్లలు వరుసగా పుడతారు. మీ మాటలు అంత అమూల్యమైనవి. కానీ ఇప్పుడు మీరు భేదభావంతో ఆశీస్సులు ఇవ్వకుండా ఊరికే కూర్చుని వృథా మాటలు చెప్పుతున్నారు. ఆమెకు కొబ్బరికాయను ప్రసాదంగా ఇవ్వండి” అని అన్నాడు. తరువాత, “కొబ్బరికాయను పగులగొట్టు” అని బాబా అంటే, “కాదు, ఆమె ఒడిలో వేయండి” అని షామా.. ఇలా కొంతసేపు బాబా, షామాల మధ్య వాదులాట జరిగాక షామా ప్రేమకు లొంగిపోయిన బాబా, “సరే, ఆమెకు బిడ్డలు కలుగుతారు, వెళ్ళు” అని అన్నారు. “ఎప్పుడో చెప్పండి” అని బాబాను నిలదీసి అడిగాడు షామా. “పన్నెండు మాసాల అనంతరం” అని బాబా చెప్పారు. షామా కొబ్బరికాయను పగులకొట్టాడు. సగం కాయను ఇద్దరూ తిని మిగిలిన సగాన్ని గంగూబాయికి ఇచ్చారు. షామా ఆ స్త్రీతో, “నా మాటకు నీవే సాక్షివి. ఈరోజు నుండి పన్నెండు మాసాల లోపు నీ కడుపుపండి సంతానం కలగకపోతే నేనేం చేస్తానో విను. వీరి తలపై ఇలాగే కొబ్బరికాయను కొట్టి, ఈ దేవుణ్ణి మసీదు నుండి తరిమివేయకపోతే నా పేరు మాధవరావు కాదు. ఇటువంటి దేవుణ్ణి ఇక మసీదులో ఉండనివ్వనని ఖచ్చితంగా చెప్పుతున్నాను. నీకు తప్పక అనుభవం కలుగుతుందని తెలుసుకో” అని చెప్పాడు. అతని ధైర్యవచనాలను విన్న ఆ స్త్రీ ఎంతో సంతోషించి బాబా చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి నిశ్చింతగా తన గ్రామానికి వెళ్లిపోయింది.

Комментарии

Информация по комментариям в разработке