ఇది తెలియని తొలిరాగం Idi Theliyani Tholiraagam

Описание к видео ఇది తెలియని తొలిరాగం Idi Theliyani Tholiraagam

Song name:
Lyrics and Tunes: Salman (Bible Teacher)
Music: Prashanth Penumaka
Singer: shenbagaraj (Chennai)
Flute, saxophone: Nathanji (Chennai)
Strings: Balaji team (Chennai)
Chorus: Priya, Hemambhika (Chennai)
guitar :prabhu
Sound engineer: Jadson Solomon (Chennai)
Rhythms: Nishanth penumaka
mixed@ grace music studio, kavuluru by sampath penumaka
digitally recorded and mastered @Jadson
chennai by judson solomon
Editing & vfx : Yedidyah pictures
Producer: ALMIGHTY GOD

ఒకవేళ ఈ పాట మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, లింక్ షేర్ చేయగలరు..
అలాగే.. పాటపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు

దయచేసి ఈ పాటను ఎవ్వరూ డౌన్లోడ్ చేసి వేరే ఛానల్ లలో గానీ, ఫేస్బుక్ పేజ్ లలో గానీ అప్లోడ్ చేయకూడదని సవినయంగా తెలియజేస్తున్నాము...

For more updates from this channel...
Please subscribe our new SSM YouTube channel..

👉🏻అత్యంత భారభరితమైన మా ఈ పరిచర్యను బలపరచాలనే ప్రేరణ మీకు కలిగినట్లైతే... మా ఫోన్ పే/ గూగుల్ పే నంబర్ 96760 13996

School of biblical science working team
GOD BLESS YOU
our whatsapp group link
https://chat.whatsapp.com/BGUlZtjo4xa...

ఇది తెలియని తొలిరాగం
మది కోరిన మధురాగం
అసలేంటో తెలియని ఆలోచనలతొ సహవాసం
పసి వయసున తొలికావ్యం
ప్రతి పలుకొక ప్రియరాగం
ప్రతిదానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం
కన్నె కనుల వెనకన ఉన్నది
కళకళలాడే, కలవరపరిచే కలల ప్రపంచం..
వెర్రి కోరికలు నినుచేరి అణువణువున
నీ తనువును తడిమే తికమక కాలం..
గమనించకుంటె అది గరళం!

నీలా యవ్వనంలో ఉన్న యోసేపు బ్రతుకు పదచూద్దాం
లేవా? నిన్ను తడిమే తలపులెన్నో తనకు ప్రియనేస్తం
వయసులోన ఉన్న తనకు..
వెంటపడితె నాడు పడతి..
పడక కోరుకోని పరిశుద్ధుడే అతనురా...
నటుని అనుసరించే నీవు..
అతని అనుసరించి చూడు..
కోరికలకు కళ్ళెమేసి వెలుగుతావురా..
ఇది లోకం నేర్పని జ్ఞానం
నీ దేవుడు నేర్పిన పాఠమురా...


మన అబ్రహాము గారబ్బాయున్నాడే...

వయసే వచ్చెనంటూ ఎవరివెంటా పడని మనిషంటా
తండ్రే తెచ్చి ఇస్తే తీసుకున్నా గొప్ప మనసంటా
నీకు నువ్వె యవ్వనాన్ని అప్పగించుకుంటె తనకు
అందమైన తోడునిచ్చే దేవుడుండగా..
నా తనువు నాది అనకు
పాడు చేసుకోకు బ్రతుకు
కోరికిచ్చినా తండ్రి దారి చూపడా..
ఇది మహిమాన్వితుని చిత్తం...
అది నెరవేర్చుట మన బాధ్యతరా..!

ఇది తెలియని తొలిరాగం
మది కోరిన మధురాగం
అసలేంటో తెలియని ఆలోచనలతొ సహవాసం
పసి వయసున తొలికావ్యం
ప్రతి పలుకొక ప్రియరాగం
ప్రతిదానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం
కన్నె కనుల వెనకన ఉన్నది
కళకళలాడే, కలవరపరిచే కలల ప్రపంచం..
వెర్రి కోరికలు నినుచేరి అణువణువున
నీ తనువును తడిమే తికమక కాలం..
గమనించకుంటె అది గరళం!

ఇది బైబిలు ఉపదేశం
యువతకు నా సందేశం
ప్రతి స్నేహితుడూ, స్నేహితురాలూ పాటిస్తే సంతోషం!

Комментарии

Информация по комментариям в разработке