Best Organic Farmer AP Chandrasekhar| Ideal organic farm

Описание к видео Best Organic Farmer AP Chandrasekhar| Ideal organic farm

ఆయనో... ప్రకృతి పిపాసి
మొక్కల పెంపకంలో సవ్యసాచి
అడవి ధర్మాన్ని ఆకళింపుచేసుకున్న వనవాసి
మట్టితోనే జీవం-జీవనం ఉందని నమ్మిన సిద్ధాంతి
ఉద్యోగంకంటే వృత్తి గొప్పదని నిరూపించిన సత్యక్రాంతి
ప్రతిమొక్కలోనూ విశిష్ట గుణాన్ని గుర్తించిన జ్ఞానమయి
ఫలపుష్పాలకి విలువ జోడింపులో అందెవెసిన చెయ్యి
కర్ణాటక రాష్ట్రం మైసూరుకి 16 కిలోమీటర్ల దూరంలోని కలలవాడి గ్రామంలో
గత 40 ఏళ్లుగా వనమే ప్రపంచంగా... సేద్యమే శ్వాసగా జీవిస్తూ...
ఇంద్రప్రస్థ పేరుతో కళాత్మక సస్య సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆ వ్యక్తే ఏపీ చంద్రశేఖర్‌.
13 ఎకరాల్లో ఆ వన సామ్రాట్‌ సృష్టించిన.. హరిత తరువుల కేదారం... అద్భుతాలకే అద్భుతం.
అతడి ఆకుపచ్చ అరణ్యం... ఇల వెలసిన నందనవనం. అరుదైనవృక్ష బృందావనం.
ఆ కల్పవృక్ష కోమల ఫలపుష్పాల సోయగం... వనశిల్ప సౌందర్యానికి ప్రతిరూపం.
మనిషి చేయి పడని, కాలు పెట్టని ప్రాంతం అడవికి ప్రతిరూపం అవుతుందనేందుకు చంద్రశేఖర్‌గారి పంచప్రాణ వనమే నిదర్శనం.

Music:
Artist: Ballad

#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming

Комментарии

Информация по комментариям в разработке