Doesn't wear Crown, Doesn't wear Tilak, Reason? | కిరీటాన్ని ధరించడు, నామాన్ని పెట్టుకోడు, ఏమిటా కథ?

Описание к видео Doesn't wear Crown, Doesn't wear Tilak, Reason? | కిరీటాన్ని ధరించడు, నామాన్ని పెట్టుకోడు, ఏమిటా కథ?

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూలవిరాట్టుకి ప్రతి శుక్రవారం వేకువజామున అభిషేకం జరుగుతుంది. ఇది శ్రీవారికి జరిగే అన్నీ సేవలలోకీ అత్యంత ప్రాచీనమైనది. ఈ అభిషేక కైంకర్యంలో స్వామి వారిని సేవించే భక్తులకు శ్రీవారు అనేక దివ్యానుభూతులు, మాటలలో వర్ణించలేని దివ్య లీలలను అనుగ్రహిస్తారని ప్రతీతి.
కోటి మన్మథుల అందంతో వెలిగిపోతూ, ఒక కన్నులో తల్లి వంటి ప్రేమ, మరొక కన్నులో తండ్రి వంటి అప్యాయతను వర్షించే చల్లని కన్నులతో, నల్లని మేఘం వంటి ఛాయతో మెరిసిపోతు, వక్షస్ధలంలో కుడివైపు మూలప్రకృతి స్వరూపిణి వ్యూహలక్ష్మీని ఎడమవైపు పద్మావతీదేవిలను ధరించి, నా పాదలను శరణు వేడిన భక్తులకు సంసారసాగరం మోకాళ్ళ లోతే అని వరాలనిస్తూ, శ్రీవారి మూలమూర్తి నిజరూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు.
శ్రీవారికి శుక్రవారం అభిషేక కైంకర్యం చేసే అవకాశం రావడం ఎప్పుడైన ప్రత్యేకమైనదే!
సాక్షాత్తూ శ్రీవారి అనుగ్రహంతో, నాకు ప్రాప్తించిన ఈ కైంకర్యంలో, స్వామి వారి దివ్య లీలలు, లీలామానుషంగా చేసే అల్లరి పనులు ఇలా ఎన్నో విషయాలు, ఎన్నో మధుర స్మృతులు ... ఇవి అజన్మాంతం పదిలంగా దాచుకునే అపురూపమైన జ్ఞాపకాలు.
డిసెంబర్ 11, 2020న శుక్రవారం నాడు శ్రీవారు నాచే చేయించుకున్న అభిషేక కైంకర్యంలో విశేషాలు, ఈ విడియో ద్వార చూడగలరు.
గోవిందా గోవింద
--------------------------------------------------------------------------------------------------------------------------
Lord Venkateswara at Tirumala Hill Shrine is offered with the most sacred Abhisheka Kainkaryam on every Friday early in the morniing. Devotees of Srivaru including Archakas, Jeeyangar Swami's, Acharya Purusha's, Staff all of them look for their turn with great devotion to be part of this most auspicious and ancient Kainkaryam. I am very fortunate that Sri Venkateswara Swami varu showered me with his immense blessing and gave me an oppurtunity to serve HIM in Abhisheka Kainkaryam on 11th December, 2020, Friday! I have recorded my divine and everlasting soul stirring experiences in this video as is. Will come up with an English version soon!
Om Namo Venkatesaya

---------------------------------------------------------------------------------------------------------------------------
Copyright 2020 All Rights Reserved with Vemgadam Youtube Channel.
VC: SVBC, Self | Photos Courtesy: Web, TTD, Self | Sketches: Thanks to Sri Keshav Venkatraghavan garu, Sri Vasu Chennupalli garu.
Please note All the clippings shown here ARE OF REPLICA TEMPLE TIRUPATI. THE ICON SHOWN IS A REPLICA ICON OF LORD VENKATESWARA.

Комментарии

Информация по комментариям в разработке