నీ ముఖము మనోహరము || Ne mukamu manoharamu || Chinny Savarapu

Описание к видео నీ ముఖము మనోహరము || Ne mukamu manoharamu || Chinny Savarapu

నీ ముఖము మనోహరము – నీ స్వరము మాధుర్యము – నీ పాదాలు అపరంజి మయము

యేసయ్యా నా ప్రాణ ప్రియుడా – మనగలనా నిను వీడి క్షణమైన (2) || నీ ముఖము ||

1. నీవే నాతోడువై నీవే నాజీవమై – నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై (2)

అణువణువున నీకృప నిక్షిప్తమై – నను ఎన్నడు వీడని అనుబంధమై (2) || యేసయ్యా ||

2. నీవే నా శైలమై నీవే నాశృంగమై – నా విజయానికే నీవు భుజబలమై (2)

అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై – నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు (2) || యేసయ్యా ||

3. నీవే వెలుగువై నీవే ఆలయమై – నా నిత్యత్వమునకు ఆద్యంతమై (2)

అమరలోకాన శుద్ధులతో పరిచయమై – నను మైమరచి నేనేమి చేసేదనో (2) || యేసయ్యా ||

Комментарии

Информация по комментариям в разработке