చౌదరి పదం ఎలా పుట్టింది? చౌదరి అంటే ఎవరు? who are chaudaries | BalijaMahanadu

Описание к видео చౌదరి పదం ఎలా పుట్టింది? చౌదరి అంటే ఎవరు? who are chaudaries | BalijaMahanadu

Which caste is chaudhary traditionally ? How chaudhary tittle got its name ? who are chaudharies ? Does this belong to only one caste " kamma " in south India ?, Does really kamma caste have any link to chaudhary tittle ? NO !

The details in this video were copied from Facebook article by Polisetty Sathirayudu - http://surl.li/grfiq

This video is truth teller of the real meaning of ' CHAUDHARY" tittle, which shows all the insciption poofs that balijavaaru ( balija caste people ) used to hold chaudary tittle long back from 1000 years, Later from 18th century mid they disinterested in having this tittle so they stopped using this as their surname!

ఈ వీడియో చూస్తున్న బలిజవారిలో తమ పూర్వికులు చౌదరి చరిత్రను కలిగిఉంటే [email protected] కు వివరాలు మెయిల్ చేయండి.
వీడియోలో ఉన్న వివరాలు - చౌదరి అంటే ఎవరు?

భూమిమై వస్తున్న పన్నును వసూలుచేసుకొని, దానిలో నాలుగవవంతు ప్రభుత్వానికి చెల్లించుకొనే అధికారిని చౌదరి అంటారు. యీ పదవి మహమ్మదీయుల పరిపాలనాకాలంలో భారతదేశము, పాకిస్తాను, బాంగ్లాదేశ్, నేపాలు వంటి చోట్ల వ్యాప్తి చెందినది. ఆకాలంలో పరిపాలన సౌలభ్యంకోసం రాజ్యాలను సుభాలని, సర్కారులని, జిల్లాలని, జమీందారీలని, తాలూకాలనీ, సముతులనీ అనేక విభాగాలుగా విభజించి పరిపాలించేవారు. సుభా పాలకుణ్ణి సుభాదారు అనీ, జిల్లా పాలకుణ్ణి జిల్లాదారు, జమీందారీ పాలకుణ్ణి జమీందారు, తాలూకా పాలకుణ్ణి తాలూకాదారు, సముతు పాలకుణ్ణి సముత్ దారు అనీ పిలిచేవారు. ఆయా విభాగాలలో పన్నులను వసూలు చేసుకొనుటకు చౌదరి అనే అధికారిని కూడా నియమించేవారు. యీ పదవి భారతదేశములో మహమ్మదీయ పాలకుల ద్వారా 10వ శతాబ్దమునాటికే ప్రవేశ పెట్టబడినట్టు ఆధారాలు కనిపిస్తున్నవి. యీ చౌదరి పదవిలోనున్న వ్యక్తి హిందువు లేదా ముస్లీం లేదా మరేయితర మతస్తుడైనా కావచ్చు. భారతదేశం అంతటా చౌదరి అనే పదం అనేక కులాల,మతాల వారు ధరించడం గమనించవచ్చు ఉదాహరణకు:- భారతదేశానికి 5వ ప్రధానమంత్రి - చరణ్ సింగ్ చౌదరి; బాంగ్లాదేశ్ రాష్ట్ర 9 వ పెర్సిడెంట్ - ఆసానుద్దీన్ చౌదరి; రంగం సినిమా హీరో పాత్రలో నటించిన జీవ అమర్ చౌదరి.

1578లో గోలుకొండ సుల్తాను ఇబ్రహీం కులీ కుతుబ్షా తన రాజ్యాన్ని విస్తరిస్తూ విజయనగర మహాసామ్రాజ్యములోని భాగమైన కొండవీడు రాజ్యాన్ని జయించి ఆరాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసము 14 సముతులుగా విభజించెను. ఆసముతులలో 44 గ్రామాలతో యేర్పడిన కూచిపూడి సముతుకు బలిజవంశీయులగు అంబటివారిని చౌదరులుగా నిర్ణయించినట్టు guturu కైఫియతులో వివరించడం జరిగినది.

గజపతుల పరిపాలనలోగల రాజమహేంద్రవరం రాజ్యమును స్వాధీన పరచుకోవడానికి గోలుకొండ సుల్తాను తెలగ సర్దారులను, మరియు తురక సేనానాయకులను పంపినప్పుడు తూర్పుగోదావరి కపిలేశ్వరం మండలంలోగల నల్లూరి ప్రాంతానికి గజపతుల అధికారి బలిజవంశీయులగు గంధం తిమ్మయ మహాపాత్రుడు గారు చౌదరిగా ఉన్నట్టు తూర్పుగోదావరి జిల్లా కైఫీయతులో వివరించడం జరిగింది.

బలిజవంశీయులైన పోలిశెట్టివారిలో చౌదరీ పెత్తందార్ల వివరాలు
క్రీస్తు శకం 1500 ప్రాంతానికి చెందిన ఆగర్భ శ్రీమంతులైన బలిజవంశీయులు పృథ్విశెట్టి పోలిశెట్టి నరసప్పరాయశెట్టి దేశాయినాయక మహపాత్రుడు గారి కుమారులలో ఒకరు రాజమహేంద్రవరం రాజ్య దేశాయిశెట్టిగారు పోలిశెట్టి గున్నయ్యశెట్టి నాయక మహాపాత్రుని గారి తమ్ముడైన ప్రతాపరంగరాయలుగారి మామగారు మిండగుదటి రాజప్ప చౌదరిగారు, యీ పోలిశెట్టి గున్నయ్య శెట్టి నాయక మహాపాత్రునిగారి సోదరుడగు పోలిశెట్టి వెంకటాద్రి రాయనంగారి కుమారులలో ఒకరు పోలిశెట్టి కృష్ణరాయప్పగారి మామగారు దేశంశెట్టి రంగప్ప చౌదరిగారు. ఈ పోలిశెట్టి గున్నయ్యశెట్టి నాయక మహాపాత్రు గారి కుమారులు నరసప్ప రాయలు శెట్టి నాయక మహపాత్రుడుగారు, ఇతని కుమారులు గున్నారాయలు శెట్టి, ఇతను మరియు ఇతను కుమారులు నరసప్ప రాయలు శెట్టి గారు రాజమహేంద్రవరం రాజ్యములోని కాకినాడ సెలపాక పరగణాకు, తరువాత బోడసకుర్రు పరగణాకు చౌదరి పెత్తనందార్లుగా వ్యవహరించారు. యీ పోలిశెట్టి నరసప్పారాయలు శెట్టిగారి కుమారులు పోలిశెట్టి గున్నయ్య శెట్టిగారి అల్లుడు అడపా చౌదరి గారు. మరొక కుమారుడగు పోలిశెట్టి కుమార అమ్మన్నశెట్టిదొరగారి కుమారులు పోలిశెట్టి గంగయ్యశెట్టి చౌదరి గారు. యీ పోలిశెట్టి నరసప్పారాయలుగారి సోదరులలో ఒకరగు పోలిశెట్టి వల్లభరాయలుగారి మామగారు యెలిశెట్టి రామయ్య శెట్టి చౌదరి, యీతని కుమారుడు పోలిశెట్టి దొడ్డప్పశెట్టిచౌదరిగారని పోలిశెట్టివారి వంశచరిత్ర ద్వారా తెలుస్తుంది.

నేటి కర్నాటక మహారాష్ట్ర ప్రాంతాలలోని వీరశైవ లింగాయత మతములోనున బలిజవారి కుల పంచాయతీ పెద్దలను సెట్టి అంటారని, వీరిని తమ లింగ బలిజ కులజులైన బెడనూరు రాజులు నియమించేవారని Bombay judicial sections , 1820 గ్రంధము నందు వవివరించబడెను. మరియు పేజి 276 నందు యీ బలిజవారి కుల పెద్దలను సెట్టి లేదా చౌదరి అని అంటారని వివరించడం జరిగింది.

వ్యాపార సాయమాలకు సంబందించిన అనేక శాసనాల్లో బలిజవారిని చౌదరీలుగా పేర్కొనడం గమనించవచ్చు. 1136 నాటి వీర బలిజ సమయమువారి కొల్హాపూరు దాన శాసనములో చౌదరి బొప్పిసెట్టిగారిని, చౌదరి గొరవి సెట్టిగారిని పేర్కొనడం చూడవచ్చు.
1287 నాటి వీర బలిజ సమయమువారి దాన శాసనములో సవుదొరె సోయి శెట్టిగారిని పేర్కొని ఉండడం చూడవచ్చు.

17, 18వ శతాబ్దాలలో తూర్పు గోదావరి జిల్లాల్లో ఆచంటవారు, సుంకరవారు, బండారువారు, జక్కపువారు, ఇమ్మడిశెట్టివారు, బోలిశెట్టివారు, మదినిశెట్టివారు, గాలిదేవర వంటి అనేక తెలగ వంశములవారు చౌదరి నామాన్ని ధరించేవారని వారి వంశ చరిత్ర తెలియజేస్తున్నది.





రెడ్డి నాయుడు రాయుడు చౌదరి పదాలు ఎలా పుట్టాయి? | How the words of Reddy Naidu Rayudu Chaudhary born?
Which caste does Chaudhary belong to?
చరిత్ర మరచిన బలిజలు...balijas forgotten by
history...
చారిత్రాత్మక బలిజ కుల చరిత్ర

#balija #chowdaries #chaudharies #settibalija #balijachowdhary
balija community songs
balija community history
#telugu #castehistory #telugucaste #telugucastes

Комментарии

Информация по комментариям в разработке