సీయోను రాజు వచ్చును || Siyonu Raju Vachunu || Telugu Zion Song || Bro N Joy Philip GS

Описание к видео సీయోను రాజు వచ్చును || Siyonu Raju Vachunu || Telugu Zion Song || Bro N Joy Philip GS

" Praise The Lord "

Sung By - Bro N Joy Philip GS
Horeb House Of Worship
Bidar (KA)

Telugu Zion Song : 317

పల్లవి: సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు 2
మీ తనువుల్ శుద్ధిచేయుడి మీ రాజుకొఱకే 2
సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు 1

1. లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు యెవరని 2
తన శక్తిని విన్నవారు చూడ నాశింతురుగా 2
క్రీస్తే మన రారాజని ఉత్సహించెదము 2
మీ తనువుల్ శుద్ధిచేయుడి మీ రాజుకొఱకే 2
|| సీయోను ||

2. వాహనములు ఎన్నియున్న గార్దభమును యెక్కెను 2
తా నెవరియింట నుండునో వారిని యుద్ధరించును 2
పరీక్షించ ఆయనను చేర్చుకో నీయందు 2
మీ తనువుల్ శుద్ధిచేయుడి మీ రాజుకొఱకే 2

3. యేసుని స్వీకరించెడు వారేగుదు రాయనతో 2
తృణీకరించువారలు నశింతురు నిక్కంబుగ 2
ప్రాముఖ్యమౌ ప్రశ్నయిది యోచించి చూచుకో 2
మీ తనువుల్ శుద్ధిచేయుడి మీ రాజుకొఱకే 2

4. రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభువాయనే 2
న్యాయవంతుడు ఆయనే మహాత్ముడైన దేవుడు 2
సదా రాజ్యంబాయనదే ఆనంద మొందుడి 2
మీ తనువుల్ శుద్ధిచేయుడి మీ రాజుకొఱకే 2
|| సీయోను ||
Thanks For Watching...

Комментарии

Информация по комментариям в разработке