వాల్నట్ హల్వా | Walnut Halwa | Akhrot ka Halwa | Walnut Sweet Indian Recipe | Sweets Recipe

Описание к видео వాల్నట్ హల్వా | Walnut Halwa | Akhrot ka Halwa | Walnut Sweet Indian Recipe | Sweets Recipe

వాల్నట్ హల్వా | Walnut Halwa | Akhrot ka Halwa | Walnut Sweet Indian Recipe | Sweets Recipe ‪@HomeCookingTelugu‬

వాల్నట్ అంటే తెలుగులో అక్రోట్లు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటితో హల్వా చేసుకుని, దాని మీద రబ్రీ వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ హల్వా రెసిపీ, రబ్రీ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి, తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

#walnuthalwa #homecookingtelugu #rabrirecipe #homecooking #akrothalwa #hemasubramanian

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

Here's the link to this recipe in English: https://bit.ly/3c7TzWk

తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 50 నిమిషాలు
సెర్వింగులు: 4

హల్వా చేయడానికి కావలసిన పదార్థాలు:

అక్రోట్లు - 3 కప్పులు (400 గ్రాములు)
నెయ్యి - 3 టేబుల్స్పూన్లు
పచ్చికోవా - 150 గ్రాములు
కాచి చల్లార్చిన పాలు - 500 మిల్లీలీటర్లు
పంచదార - 1 కప్పు
నెయ్యి - 1 టేబుల్స్పూన్
యాలకుల పొడి - 1 టీస్పూన్

రబ్రీ చేయడానికి కావలసిన పదార్థాలు:

పాలు - 250 మిల్లీలీటర్లు
గోరువెచ్చటి పాలు
కుంకుమపువ్వు
పచ్చికోవా - 50 గ్రాములు
పంచదార - 4 టీస్పూన్లు
యాలకుల పొడి - 1 / 4 టీస్పూన్

తయారుచేసే విధానం:

ముందుగా అక్రోట్లను మిక్సీలో వేసి బరకగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి

ఒక పాన్లో నెయ్యి వేసి అందులో అక్రోట్ పొడి వేసి రంగు మారేంత వరకూ వేయించిన తరువాత పచ్చికోవా వేసి కలుపుకోవాలి

ఆ తరువాత పాలు పోసి బాగా మరిగించాలి

ఇరవై నిమిషాల తరువాత పంచదార వేసి కలుపుకోవాలి

పంచదార కరిగి, హల్వా దగ్గరపడిన తరువాత నెయ్యి యాలకుల పొడి వేసి కలుపుకోవాలి

పొయ్యి కట్టేసి, హల్వాను చల్లార్చి ఒక టిన్లో వేసి సమంగా పరుచుకోవాలి

దీన్ని మూడు గంటలు పక్కన పెట్టి సెట్ అవ్వనివ్వాలి

ఈ లోపల రబ్రీ తయారుచేయడానికి ఒక పాన్లో పాలు పోసి, అందులో పచ్చికోవా వేసి కలుపుకోవాలి

పాలు కొద్దిగా చిక్కపడిన తరువాత పంచదార వేసి కలిపి, కుంకుమపువ్వు కలిపిన పాలను కూడా వేసి కలుపుకోవాలి

అంతే, వాల్నట్ హల్వాను రబ్రీతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK -   / homecookingtelugu  
YOUTUBE:    / homecookingtelugu  
INSTAGRAM -   / homecookingshow  

A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке