2 రకాల వేపుడు | 2 Types of Vepudu | Kanda Gadda Vepudu | Brinjal Tawa Fry |

Описание к видео 2 రకాల వేపుడు | 2 Types of Vepudu | Kanda Gadda Vepudu | Brinjal Tawa Fry |

2 రకాల వేపుడు | 2 Types of Vepudu | Kanda Gadda Vepudu | Brinjal Tawa Fry | ‪@HomeCookingTelugu‬

#వేపుడు #Vepudu #KandaGaddaVepudu #BrinjalTawaFry #homecookingtelugu

Chapters :
Promo - 00:00
Kanda Gadda Vepudu - 00:13
Brinjal Tawa Fry - 07:08

కందగడ్డ వేపుడు
కావాల్సిన పదార్ధాలు :

కందగడ్డ - 1/2 కిలో
మజ్జిగ
పసుపు - 1/2 టీస్పూన్
ఉప్పు - 1/2 టీస్పూన్

బియ్యంపిండి - 3 టీస్పూన్లు
పసుపు - 1/2 టీస్పూన్
పచ్చికారం - 1 టీస్పూన్
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
మిరియాలపొడి - 1/2 టీస్పూన్
జీలకర్ర పొడి - 2 టీస్పూన్
ధనియాలపొడి - 3 టీస్పూన్లు
సోంపు పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
అల్లం వెల్లులి పేస్టు - 1 టీస్పూన్
నిమ్మరసం - 1/2
నీళ్ళు
నూనె


తయారీ విధానం :

ముందుగా కందగడ్డ ని మీడియం సైజు ముక్కలుగా కోసి పలచటి మజ్జిగ లో ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి.

తరువాత కందగడ్డ ముక్కల్ని ఉడకపెట్టడానికి ఒక కడై లో నీళ్ళు , అరా టీస్పూన్ పసుపు , అరా టీస్పూన్ ఉప్పు , కందగడ్డ ముక్కలు వేసి ఐదు నిముషాలు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి.

ఐదు నిముషాలు తరువాత స్టవ్ ఆఫ్ చేసి ముక్కల్ని వడకట్టి చల్లారనివ్వాలి .

మసాలా చేసుకోవడానికి ఒక వెడల్పాటి ప్లేట్ లో మూడు టీస్పూన్లు బియ్యంపిండి , అరా టీస్పూన్ పసుపు , ఒక టీస్పూన్ పచ్చి కారం , ఒక టీస్పూన్ కాశ్మీరీ కారం , అరా టీస్పూన్ మిరియాల పొడి , రెండు టీస్పూన్లు జీలకర్ర పొడి , మూడు టీస్పూన్లు ధనియాల పొడి , ఒక టీస్పూన్ సోంపు పొడి , ఒక టీస్పూన్ గరం మసాలా , ఓకే టీస్పూన్ ఉప్పు , ఒక టీస్పూన్ అల్లం వెల్లులి పేస్టు , అరా చెక్క నిమ్మరసం , కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి.

తరువాత ఉడకపెట్టిన కందగడ్డ ముక్కలకి మసాలా పాటించి పది నిముషాలు మెరినేట్ చేసుకోవాలి .

తరువాత ఒక తవ కానీ పెనం తీసుకొని రెండు టేబుల్స్పూన్లు నూనె వేసుకొని పెనం మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మసాలా పాటించిన కందగడ్డ ముక్కలు ఒక ఒకటిగా వేసుకొని రెండు పక్కల మూడు నిముషాలు పటు బాగా వేయించుకోవాలి .


తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 15 నిమిషాలు
సెర్వింగులు: 4

కావలసిన పదార్థాలు:

వేయించిన శనగపప్పు పొడి - 2 టేబుల్స్పూన్లు
పసుపు - 1 / 2 టీస్పూన్
కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
జీలకర్ర పొడి - 1 1 / 2 టీస్పూన్లు
ఆంచూర్ పొడి - 2 టీస్పూన్లు
గరం మసాలా పొడి - 1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
ఉప్పు - 1 టీస్పూన్
పెద్ద వంకాయ - 1
నూనె
తరిగిన కొత్తిమీర

తయారుచేసే విధానం:

ముందుగా ఒక బౌల్లో శనగపిండి, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆంచూర్ పొడి, గరం మసాలా పొడి, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలిపి, ప్లేట్లోకి తీసుకోవాలి

ఇప్పుడు శుభ్రంగా కడిగిన పెద్ద వంకాయలని మీడియం సైజులో మందంగా ఉండేట్టు గుండ్రటి స్లైసెస్లా కట్ చేయాలి

ఒక్కొక్క స్లైసును మసాలా పొడిలో ముంచి, రెండు వైపులా బాగా కోట్ చేయాలి

మాసాలతో కోట్ చేసిన వంకాయ స్లైసులు అన్నిటినీ కనీసం ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి

ఆ తరువాత ఒక పెనం మీద నూనె వేసి, సమంగా పెనం మొత్తం పరిచిన తరువాత వేడి చేయాలి

వేడిగా అయిన పెనం మీద వంకాయ స్లైసులు పెట్టి, ఒక్కొక్క వైపు ఐదు నిమిషాలు కాల్చాలి

వంకాయ స్లైసులు కాస్త పొడిగా అనిపించినప్పుడల్లా నూనె అద్దుతూ ఉంటె బాగా కాలతాయి

వంకాయ స్లైసులు చెరొక వైపు ఐదు నిమిషాలకంటే ఎక్కువ కాలి, వాటిలో ఉన్నపచ్చిదనం పోయిన తరువాత వాటిని బయటకి తీసేయచ్చు

అంతే, ఎంతో రుచిగా ఉండే పెద్ద వంకాయ ఫ్రై తయారైనట్టే, దీన్ని ఉన్నపళంగా తినచ్చు లేదంటే ఏదైనా అన్నంలోకి కూడా పక్కన పెట్టుకుని తినచ్చు



Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book at https://shop.homecookingshow.in/

Follow us :
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / home.cooking.telugu  

A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке