Coconut Sesame Laddu | కొబ్బరి నువ్వుల లడ్డూ | Kobbari Nuvvula Laddoo | Healthy Snack | Sweets

Описание к видео Coconut Sesame Laddu | కొబ్బరి నువ్వుల లడ్డూ | Kobbari Nuvvula Laddoo | Healthy Snack | Sweets

కొబ్బరి నువ్వుల లడ్డూ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ లడ్డూలను ఎలా చేయాలో చూసి, తప్పకుండా ట్రై చేయండి.

#kobbarinuvvulaladdu #nuvvulukobbariladdu #nuvvundalu #kobbarundalu

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin...

Here's the link to this recipe in English: https://bit.ly/39gD7Cp

తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 5 నిమిషాలు
సెర్వింగులు: -

కావలసిన పదార్థాలు:

నువ్వులు - 1 కప్పు (250 మిల్లీలీటర్లు)
వేయించి, పొట్టు తీసేసిన వేరుశనగ గుళ్ళు - 1 / 2 కప్పు
ఎండుకొబ్బరి తురుము - 3 / 4 కప్పు
యాలకుల పొడి - 1 టీస్పూన్
తురిమిన బెల్లం - 3 / 4 కప్పు
నెయ్యి - 1 టేబుల్స్పూన్

తయారుచేసే విధానం:

ముందుగా ఒక ప్యాన్లో నువ్వులు వేసి, అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించి, బయటికి తీసేయాలి

అదే ప్యాన్లో వేయించి పొట్టు తీసేసిన పల్లీలు వేసి కొద్దిగా వేయించి బయటకి తీసి పక్కన పెట్టాలి

మళ్ళీ అదే ప్యాన్లో తురిమిన ఎండుకొబ్బరి వేసి అది కూడా రంగు మారేంత వరకూ వేయించి బయటకి తీసేయాలి

ఇవన్నీ చల్లారిన తరువాత ఒక మిక్సీలో ముందుగా నువ్వులు, పల్లీలు వేసి ఒకసారి రుబ్బాలి

ఆ తరువాత ఎండుకొబ్బరి, యాలకుల పొడి వేసి ఇంకొక సరి రుబ్బాలి

ఇవన్నీ మెత్తగా అయిన తరువాత బెల్లం వేసి మొత్తం కలిసేట్టు రుబ్బాలి

ఆ తరువాత మిశ్రమాన్ని మొత్తం ఒక పెద్ద బౌల్లో వేసి, అందులో నెయ్యి వేసి, లడ్డూలు చుట్టాలి

అంతే, ఎంతో రుచిగల, ఆరోగ్యకరమైన కొబ్బరి నువ్వుల లడ్డూ తయారైనట్టే, వీటిని ఒక ఎయిర్-టైట్ డబ్బాలో వేసి ఉంచితే మూడు నాలుగు రోజుల వరకూ ఫ్రెష్గా నిలవుంటాయి

You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!

ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK:   / homecookingtelugu  
YOUTUBE:    / homecookingtelugu  
INSTAGRAM -   / homecookingshow  

A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке