7 AM Mutton Biryani | Early Morning Biryani | Proddatur Famous Chand Mutton Biryani | Food Book

Описание к видео 7 AM Mutton Biryani | Early Morning Biryani | Proddatur Famous Chand Mutton Biryani | Food Book

తయారీలో రుచితోపాటు ఆరోగ్యాంశాలకు ప్రాముఖ్యతనిస్తూ, నాణ్యత గల ముడి పదార్థాల ఉపయుక్త పరుస్తూ, ఆహారాన్ని కట్టెల అంతికపై శాస్త్రీయ విధానంలో వండి వడ్డిస్తూ ప్రసిద్ధత చేకూర్చుకుని, విశేష ఆదరణ పొందుతున్నారు ప్రొద్దుటూరు లోని చాంద్ మటన్ బిర్యానీ శాల నిర్వాహకులు ఆదినారాయణ గారు.

ఆది నారాయణ గారి తయారీ శైలి ని పునికిపుచ్చుకున్న వారి అబ్బాయి శ్రీను సద్గుణం కలిగిన వంటకం చేయుటలో అనువు అలవరుచుకున్నారు.

తాజా పొట్టేలు కూర, యన్.డి.యల్ బియ్యం,మేలైన ఇతర ముడి పదార్థాల మేళవింపుతో తయారు అవుతుంది బిర్యానీ.

బియ్యం, మాంసం ఎలా, ఎంత వరకు ఉడకాలి అన్నదానిపై సూక్ష్మ పరిశీలన,మసాలా పొందికలో నిశిత శ్రద్ద వహించిన నేపథ్యంలో సహజ వర్ణికతో రూపు దాల్చిన బిర్యానినీ చూస్తేనే తృప్తి కలుగుతుంది.తినే ముందు కదంబిస్తున్న తరుణానే చేతికి తాకే స్పర్శ ద్వారా ఆహార ఉన్నతి మనకు తెలుస్తుంది.

మసాలా వినియోగంలో పరిమిత పాటించి రుచికోసం అక్కర్లేనివి వినియోగించని రీత్యా మసాలా ఘాటు,మంట అస్సలు ఉండదు బిర్యానీలో.

ముక్కు ఇరువైపులా బాగా ఉడికి ద్రవ మసాలా గుజ్జు కలిగి ఉంటుంది. అట్టి ముక్కను బిర్యానీ లో మిళితం చేసి నోటికి అందిస్తే ఆహారంలో నివ్వటిల్లి ఉన్న ప్రాప్తం వ్యక్తం చేయు రుచి మనకు చేకూరుతుంది.


చిరునామా:- Chand biryani center

MYD ROAD, Srinivasa Nagar, Proddatur, Andhra Pradesh.
https://g.co/kgs/igxwVK

Комментарии

Информация по комментариям в разработке