vasinyadi vakdevatalu వశిన్యాది వాగ్దేవతలు

Описание к видео vasinyadi vakdevatalu వశిన్యాది వాగ్దేవతలు

7. శ్రీ చక్ర సప్తమ ఆవరణ దేవతలు:-
సప్తమి లేక ఏడవ ఆవరణచక్రం అష్ట త్రికోణ చక్రం
దీనికి సర్వరోగహరచక్రం అని పేరు
ఇక్కడ ఉండే దేవతలు ఎనిమంది వశిన్యాది వాగ్దేవతలు.వీరికి రహస్య యోగినులు అని పేరు- అధిదేవత -త్రిపురా సిద్ధి చక్రేశ్వరి

లలితా సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి, అగస్త్యునికి జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉన్నది. లలితా సహస్రనామాన్ని వశిన్యాది వాగ్దేవతలు (వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని అనే 8 మంది దేవతలు) దేవి ఆజ్ఞానుసారం దేవిస్తుతికోసం పఠించారని చెప్పబడింది. ఈ స్తోత్రంలో దేవి కేశాది పాదవర్ణన ఉంది.

సర్వజ్ఞా సదనోపరి
చక్రే విపులే సమాకలిత గేహాః
వన్దే వశినీ ముఖ్యాః
శక్తీః సిందూర రేణు శోణ రుచః

సర్వజ్ఞా సదనం అంటే సర్వ రక్షాకర చక్రానికి గల మరో పేరు
సర్వజ్ఞా సదనం.

1.సర్వఙ్ఞే
2.సర్వశక్తే
3.సర్వైశ్వర్యప్రదాయినీ
4.సర్వఙ్ఞానమయీ
5.సర్వవ్యాధివినాశినీ
6.సర్వాధారస్వరూపే
7.సర్వపాపహరే
8.సర్వానందమయీ
9.సర్వరక్షాస్వరూపిణీ
10.సర్వేప్సితఫలప్రదే

సర్వజ్ఞాది దేవతలతో మొదలవుతోంది కనుక సర్వజ్ఞా సదనం అన్నారు. దాని పైన వశిన్యాది వాగదేవతలు ఒక్కొక్కరు చక్కని గృహాలను ఏర్పాటు చేసుకున్నారుట. ఎనిమంది దేవతలు ఎనిమిది త్రికోణాల చక్రం లో సప్తమావరణ లో వున్నారు.
వాళ్ళు సిందూరపు కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి వారు.
వశిన్యాది వాగ్దేవతలు
1.వశినీ,
2 కామేశ్వరీ,
3.మోదినీ,
4.విమలే,
5.అరుణే,
6.జయినీ,
7.సర్వేశ్వరీ,
8.కౌళిని,
వీళ్ళు వాగ్దేవతలు,అక్షరాధి దేవతలు,సరస్వతీ రూపాలు వీళ్ళు మొత్తం.

వర్గాష్టక మిళితాభిః
వశినీ ముఖ్యాభి రావృతాం భవతీమ్,
చింతయతాం సితవర్ణాం
వాచో నిర్యాన్ త్యయత్నతో వదనాత్.

అమ్మా!వర్గాష్టకము తో కూడినటువంటి వశినీ మొదలైన దేవతల తో కూడిన నీ తెల్లని రూపాన్ని ఎవరు ధ్యానిస్తారో వారి నోటి నుండి అద్భుతమైన పలుకులు వస్తాయి.వర్గాష్టకము అంటే
అకారం నుండి క్షకారం వరకూ వున్న 8 వర్గములు వాటి
అధిదేవతలు అయిన వశిన్యాది వాగ్దేవతలు.
అక్షరాలు మొత్తం సంస్కృతంలో 50 ఉన్నాయి. 
1.అకారం నుండి అం అః వరకు
2.క వర్గము
3.చ వర్గము
4.ట వర్గము
5.త వర్గము
6.ప వర్గము
7.యవర్గము
8.శ వర్గము
"మొత్తం 8 వర్గములు.ఒక్కొక్క వర్గానికి ఒక్కో వశిన్యాది దేవత".
వశినీ ముఖ్యాభిః వీళ్ళందరి యొక్క సమాహార రూపమైన తెల్లని కాంతుల నీయొక్క శారదా రూపాన్ని ధ్యానించే వారికి పలుకులను ప్రసాదిస్తావు.

శారదామ్మ శిరస్సు పై ఉన్న చంద్రకళ దేనిని తెలియజేస్తుంది?

అక్షరాలు చిట్టచివరగా నాదంలోకి వెళ్ళాలి. నాదంలోని చివరిదశ తురీయభూమిక. అది అవ్యక్తమైన అమృతదశ. అదే చంద్రకళ. అమ్మ ధరించిన చంద్రకళ .

మంత్రములను విభజన చేస్తే ఎనిమిది భాగములు అవుతాయి.

1.వశిని:--

కొన్ని మంత్రములు వశ్యము చేసుకోవటానికి పనికి వస్తాయి.
వశ్యము అంటే అవతలి వాళ్ళని లొంగదీసుకోవటానికి అనే కాదు.
మన ఇంద్రియాలు మన బుద్ధి మన control లో వుండాలి కదా దానికి కూడా ఈ వశినీ మంత్రములు పనికివస్తాయి.

ఇంట్లో ఒకళ్ళ మాట ఇంకొకళ్ళు వినక పొతే ఆ ఇంట్లో పని జరగదు. ఆవిడకు ఆయన వశీకరణ కావలి, ఆయనకు ఆవిడ వశీకరణ కావాలి. ధర్మపథం గా ఒక మంచి మాట చెప్పినా అది పది మంది విని బావుపడాలన్నా ఆ మాటకు వశ్య శక్తి వుండాలి.

వశీకరణ అంటే చెడు అర్థం తీయడానికి వీలు లేదు.

ప్రకృతి కూడా మనకు అనుకూలం కావాలంటే అదీ వశీకరణమే. వశీకరణం అంటే అవతలి వారు మనకు అనుకూలం అవుట. ఈ మంత్రాలను వశీకరణ మంత్రములు అంటారు. ఈ మంత్రములకు అధి దేవత వశిని.

ఒక మంచి మాట మహా పండితుడు చెప్పినా చెల్లదు,అదే మాట పిల్లాడు చెపితే చెల్లిపోతుంది!!!ఎందువల్ల అక్కడ ఆవిడ వచ్చి కూర్చున్నది ఆ వాక్కులో.అందుకనే లక్షల గ్రంథాలు చేయలేని పని అమ్మ అనుగ్రహం చేయగలదు.

తస్య వక్త్రాన్తరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ (నిస్సరేత్ = వెలువడుట) అంటాడు కాళిదాసు అమ్మవారి అనుగ్రహం గురించి చెపుతూ

కుండలినీ జాగరణకు సంబంధించిన మంత్ర శక్తులు కౌళిని(2)

కోరిన కోరికలు తీర్చే మంత్రశక్తులు కామేశ్వరీ(3)

సర్వ ప్రకాశత్వానికి పనికివచ్చే మంత్రములు అరుణ(4)

ఆనందాన్ని ,తృప్తి ని కలిగించటానికి మోదిని(5)

నిర్మలమైన అంతః కరణములు కలిగించే మంత్రములు విమల(6)

దేనియందైనా ఆధిక్యాన్ని కలిగించే మంత్రములు జయినీ(7)

సర్వేశ్వరీ (8)ప్రతిదానియందు ఒక పట్టు ను, ఈశిత్వము అనే శక్తి ని ఇచ్చేది.

శ్రీ సర్వ రోగహరాఖ్యే
చక్రేస్మిన్ త్రిపుర పూర్వికాం సిద్ధామ్
వన్దే రహస్య నామ్నా
వేద్యాభిః శక్తిభిః సదా సేవ్యామ్.

సప్తమ లేక ఏడవ ఆవరణ చక్రం లో వున్న త్రికోణముల సంఖ్య 8.
అష్ట త్రికోణ చక్రం.మధ్యస్థ త్రికోణాన్ని ఆనుకుని ఉన్న ఎనిమిది త్రికోణాల వలయం. దీనికి సర్వరోగహరచక్రం అని పేరు. ఇక్కడ ఉండే దేవతలు ఎనిమంది వశిన్యాదులు. సుధాబిందువును కలిగి ఉన్న త్రికోణాన్ని ఆనుకుని ఈ‌ అష్ట త్రికోణ చక్రం ఉంది.
ఇక్కడ వున్న యోగినిలు పేరు రహస్య యోగినులు - త్రిపురా సిద్ధి చక్రేశ్వరి ఈ ఎనిమంది దేవతలకు నాయకురాలు గా వున్న అమ్మను ఎప్పుడూ సేవిస్తూ ఉంటాను,ఆ తల్లి మనల్ని రక్షించుగాక.

సౌందర్యలహరి

సవిత్రీభిః వాచాం శశిమణి శిలా భంగరుచిభిః
వశిన్యాదిభిః త్వాం సహజనని సంచియతి యః
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః
వచోభిః వాగ్దేవీ వదన కమలామోద మధురైః

సంచియతి= ధ్యానించునో
యః =ఎవడు
సః = అతడు
వచోభిః = వాక్సంపత్తితో


నవత్రికోణ చక్రం అంటే ఏమిటి?
బిందువు,త్రికోణం,అష్టావరణం లో వున్న అష్ట త్రికోణాలు ఈ మూడు వెలికి తీస్తే నవావరణం,దీన్ని నవ కోణ చక్రం అంటారు.ఇందులో వుండే దేవతల పేర్లు బాలా,వారాహీ, శ్యామల, లలిత

Комментарии

Информация по комментариям в разработке