Lalitha kavacham-Sri Lalitha Stavaratnamలలితా కవచము-శ్రీలలితా స్తవరత్నం

Описание к видео Lalitha kavacham-Sri Lalitha Stavaratnamలలితా కవచము-శ్రీలలితా స్తవరత్నం

Lalitha kavacham-Sri Lalitha Stavaratnam
లలితా కవచము-శ్రీలలితా స్తవరత్నం

1.లలితా పాతు శిరోమే
లలాటం అంబా చ మధుమతీ రూపా I
భ్రూమధ్యం చ భవానీ
పుష్పశరా పాతు లోచన ద్వంద్వం

2.పాయాన్నాసాం బాలా
సుభగా దన్తాంశ్చ సుందరీ జిహ్వామ్ I
అధరోష్ఠం ఆదిశక్తిః
చక్రేశీ పాతు మే సదా చుబుకమ్

3.*కామేశ్వరీ* చ కర్ణౌ
కామాక్షీ పాతు గణ్డయో ర్యుగళమ్ I
శృంగారనాయికా అవ్యాత్
వదనం
సింహాసనేశ్వరీ చ గళమ్ II 3 II

4.*స్కన్ద ప్రసూశ్చ* పాతు(స్కందమాత)
స్కన్ధౌ,బాహూ చ పాటలాంగీ మే I
పాణీ చ పద్మనిలయా
పాయాత్ అనిశం నఖావళీమ్ విజయా

5. కోదణ్డినీ చ వక్షః
కుక్షిం చావ్యాత్ కులాచల తనూజా I
కల్యాణీ చ వలగ్నం(నడుము)
కటిం చ పాయాత్ కళాధర శిఖణ్డా
6.ఊరుద్వయం చ పాయాత్
ఉమా*, మృడానీ చ జానునీ రక్షేత్ I
జంఘే చ షోడశీ మే
పాయాత్ పాదౌ చ పాశసృణిహస్తా
****************
7.ప్రాతః పాతు పరా మాం
మధ్యాహ్నే పాతు మణిగృహాధీశా I
శర్వాణ్యవతు చ సాయం(శర్వణీ దేవి)
పాయాత్ రాత్రౌ చ భైరవీ సాక్షాత్

8.భార్యాం రక్షతు గౌరీ
పాయాత్ పుత్రాంశ్చ బిన్దుగృహపీఠా I
(ఇంటినంతటినీ రక్షిస్తుంది అమ్మవారు)
శ్రీవిద్యా చ యశోమే
శీలంచ అవ్యాత్ చిరం మహారాజ్ఞీ

ఇంట్లో వుండేవాళ్ళు అందరూ బావుంటేనే సాధన సరిగ్గా సాగుతుంది.అందూకే అందరూ బావుండాలి అనటంలో రెండు ఉద్దేశ్యాలు.
1. ఇంట్లో వుండేవాళ్ళు అందరూ
క్షేమంగా వుండాలి
2.వారంతా నేను చేసే సాధనకు అనుకూలంగా వుండాలి.

సంబోధనా విభక్తి:---
సంబోధన వచ్చేటప్పటికల్లా అమ్మ తప్ప ఇంకోటి ఏమీ లేదు.

9.పవనమయి! పావకమయి!
క్షోణీమయి! వ్యోమమయి! కృపీటమయి!
రవిమయి! శశిమయి! దిజ్ఞ్ మయి!
సమయమయి! ప్రాణమయి!
శివేపాహి శివేపాహి శివేపాహి.

వాయువు,అగ్ని,భూమి,గగనము లేక ఆకాశము,జలము,సూర్యుడు, చంద్రుడు,దిక్కులు, కాలము శివ శక్తుల సామరస్య రూపిణి (సమయమయి)ప్రాణమయి
మయి=ఇవి అన్నీ అమ్మ మయములే

10.కాళీ! కపాలిని! శూలిని!
భైరవి! మాతంగి! పంచమి! త్రిపురే!
వాగ్దేవి! వింధ్యవాసిని!
బాలే! భువనేశి! పాలయ చిరం మామ్
దశ మహా విద్యా రూపిణి అయిన శ్రీ విద్య ను ఈ శ్లోకంలో చూపించారు.

1.అభినవ సిందూరాభాం అంబా
త్వాం చిన్తయన్తి యే హృదయే I
ఉపరి నిపతంతి తేషాం
ఉత్ఫుల్ల నయనా కటాక్ష కల్లోలాః
(లలితా దేవీ స్వరూపం)

2.వర్గాష్టక మిళితాభిః(అకారం నుండి క్షకారం వరకూ వున్న 8 వర్గములు వాటి అధి దేవతలు వశినీ ముఖ్యాభిః)
వశినీ ముఖ్యాభి రావృతాం భవతీమ్,
చింతయతాం సితవర్ణాం
వాచో నిర్యాన్ త్యయత్నతో వదనాత్
(సరస్వతీ స్వరూపం)

3.కనక శలాకా గౌరీం-
కర్ణవ్యాలోల కుణ్డల ద్వితయామ్ I
ప్రహసిత ముఖీంచ భవతీం
ధ్యాయంతో ఏత ఏవ భూధనదాః
(లక్ష్మీ దేవీ స్వరూపం)

4.శీర్షాంభోరుహ మధ్యే
శీతల పీయూష వర్షిణీం భవతీమ్,
అనుదిన మనుచిన్తయతాం
ఆయుష్యం భవతి పుష్కల మవన్యామ్
(సహస్రార కమలాంతర ధ్యానం)

మధురస్మితాం మదారుణనయనాం
మాతంగ కుంభ వక్షోజామ్,
చంద్రావతంసినీం త్వాం
సవిధే పశ్యన్తి సుకృతినః కేచిత్
(భజంతిత్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీం)

లలితాయాః స్తవరత్నం
లలితపదాభిః ప్రణీత మార్యాభిః I
ప్రతిదిన మవనౌ పఠతాం
ఫలాని వక్తుం ప్రగల్భతే సైవ

సత్ అసత్ అనుగ్రహ నిగ్రహ
గృహీత ముని విగ్రహో భగవాన్
సర్వాసాం ఉపనిషదాం
దుర్వాసా జయతి దేశికః ప్రథమః ॥

శ్రీలలితా స్తవరత్నం సంపూర్ణం

Комментарии

Информация по комментариям в разработке