హాండ్స్ స్వచ్ఛందసంస్థ ఎల్లప్పుడూ సమాజ సేవలోవుంటుంది-సీఈఓనారాయణస్వామి.

Описание к видео హాండ్స్ స్వచ్ఛందసంస్థ ఎల్లప్పుడూ సమాజ సేవలోవుంటుంది-సీఈఓనారాయణస్వామి.

అనంతపురం జిల్లా
గుత్తి పట్టణం తాడిపత్రి రోడ్డు నందుగల హాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ సీ ఈ వో నారాయణస్వామి ఆధ్వర్యంలో పలు రకాలైన సామాజిక సేవ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ స్వచ్ఛంద సంస్థ సీఈఓ నారాయణస్వామి మాట్లాడుతూ మొట్టమొదటగా 1994 సంవత్సరం హాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నేచురల్ ఫారెస్ట్ రీజియన్ రిసోర్చ్మెంట్ భాగంగా ఎన్విరాన్మెంటల్ ప్రాముఖ్యంగా పనిచేసిందని తెలిపారు. 2004 లో ఆరోగ్య సంబంధమైన హెచ్ ఐ వి ప్రివెన్షన్ ప్రాజెక్ట్ ప్రాముఖ్యంగా, మా స్వచ్చంద సంస్థ పని చేసిందని ఆయన తెలిపారు, ఏ పీ సాక్స్ కు ఆనుబంధంగా గుత్తి గుంతకల్లు డోన్ పత్తికొండ నందికొట్కూర్ మండలాలలో పనిచేశామని తెలిపారు. దళిత ఈక్విటీ అనే ప్రాజెక్టు ద్వారా దళిత మహిళ భూ హక్కు పై అనేకమైన పోరాటాలు జరిపి తద్వారా తొమ్మిది వందల యాభై ఎకరాల భూమిని 500 మంది దళిత మహిళలకు కేటాయించి వారికి అధికారులచే భూ సంబంధమైన అధికారిక పత్రాలను ఇప్పించటం జరిగిందని తెలిపారు. వారు నేటికి ఆ భూములలో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాబోవు కాలంలో ఆ భూములలో కూడా మొక్కల పెంపకం చేపట్టే ఆలోచన ఉన్నట్లు ఆయన తెలిపారు. సహజ అటవీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గుంతకల్ మండలం నాగసముద్రం పరిధిలో 8 వేల హెక్టార్ల వరకు మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు, ఆ గ్రూప్ ఫారెస్ట్ కార్యక్రమంలో భాగంగా పండ్లు తోటల అభివృద్ధి చేయడంలో ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు హ్యాండ్ సీ ఈ ఓ నారాయణస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు మొక్కలు పంపిణీ ఇన్ఫోసిస్ మరియు రెనీవ్ అనే కార్పొరేట్ సంస్థల తోడ్పాటు ద్వారా సేవ్ ట్రీ ఆర్గనైజేషన్ సహకారంతో ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ క్షేత్రస్థాయి లో రైతులకు అవగాహన మరియు అమలు పనితీరు లో మాత్రమే భాగస్వామ్యంగా ఉంటుందని నారాయణస్వామి తెలిపారు. ఈ విధంగా అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని తమ వంతు హాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Комментарии

Информация по комментариям в разработке