శ్రీ బాలత్రిపురా సమేత శ్రీ సంగమేశ్వరస్వామి దేవాలయం,సంగం జాగర్లమూడి ,తెనాలి,గుంటూరు జిల్లా

Описание к видео శ్రీ బాలత్రిపురా సమేత శ్రీ సంగమేశ్వరస్వామి దేవాలయం,సంగం జాగర్లమూడి ,తెనాలి,గుంటూరు జిల్లా

Sri SangameswaraSwamy Temple | Samgamjagarlamudi | Tenali | Guntur District

**శ్రీ బాలత్రిపురా సమేత శ్రీ సంగమేశ్వరస్వామి దేవాలయం,సంగం జాగర్లమూడి ,తెనాలి,గుంటూరు|కృష్ణ నది కాలువ**

రవాణా సౌకర్యాలు : గుంటూరు నుండి 18 kms ,తెనాలి నుండి 7 kms, సంగంజాగర్లమూడి నుండి 1 km

శ్రీ బాలత్రిపురా సమేత శ్రీ సంగమేశ్వరస్వామి దేవాలయం కు తూర్పు వైపు తుంగభద్ర కాలువ మరియు పడమర వైపు కృష్ణ నది కాలువ ప్రవాహిస్తుంది.ఆ కృష్ణ నది లో సాన్నం చేసి ప్రధాన ద్వారం దగ్గర ఉన్న గంగాదేవి గుడి లో గంగాదేవి ,పార్వతి దేవి , గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి లను దర్శించి తరువాత ప్రధాన ద్వారం నుండి లోపలికి ప్రవేశించాలి.అక్కడ శ్రీ కాలబైరవస్వామి ని దర్శనం చేసుకొన్ని శ్రీ బాలత్రిపురా సమేత శ్రీ సంగమేశ్వరస్వామి దర్శనం చేసుకోవాలి. శ్రీ సంగమేశ్వరస్వామి దేవాలయం కు దక్షిణ వైపు శ్రీ పార్వతి దేవి సమేత శ్రీ పాపవినాశేశ్వరస్వామి,శ్రీ విజయగణపతి స్వామి ,శ్రీ వీరభద్రస్వామి ,క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయస్వామి కొలువై ఉన్నారు. శ్రీ సంగమేశ్వరస్వామి దేవాలయం కు ఉత్తరం వైపు శ్రీ కాలబైరవస్వామి ,100 సంవత్సరాల వట వృక్షం ,నవగ్రహ మండపం ఉన్నాయి.ఇక్కడ గోశాల లో గో పూజ నిత్యం జరుగుతుంది మరియు 150 సంవత్సరాల పూర్వం అన్నశాల లో నిత్యం అన్నప్రసాదం స్వీకరించే వాళ్ళు.కోరుకొన్న కోరికలు తీర్చే శ్రీ సంగమేశ్వరస్వామి దేవాలయం.స్థల పురాణము ప్రకారం పూర్వకాలంలో అత్రి మహాముని త్రిలోక సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి రాగా కాలికి ఎదురు రాయి తగలడంచే ఏమిటాని తన దివ్యదృష్టితో చూడగా భూమిలోపల పరమేశ్వరుని విగ్రహం ఉండడం గమనించి స్వామివారిని యంత్రప్రతిష్ట చేసి త్రికాల అర్చన, నైవేధ్యం జరపమని ఆదేశించారని ప్రతీతి.తరువాత కాలంలో రాచూరు జమిందారులైన శ్రీరాజా మాణిక్యరావు వంశస్తులు స్వామివారికి ఆలయం నిర్మించి, భూములు ఇచ్చి ఉన్నారు.

Комментарии

Информация по комментариям в разработке