Uppal Prasad|A Successful Farmer inspiring Journey| అలుపెరగని రైతు ఉప్పల ప్రసాద్‌| 77298 91870

Описание к видео Uppal Prasad|A Successful Farmer inspiring Journey| అలుపెరగని రైతు ఉప్పల ప్రసాద్‌| 77298 91870

ఉప్పల ప్రసాదరావు,ఆదర్శ రైతు.
కృష్ణా జిల్లా ఘంటశాల మండలం, ఘంటశాలపాలెం.

వ్యవసాయంలో పడిలేచిన కెరటం.
4 దశాబ్దాల ప్రస్థానంలో కాచివడపోసిన అనుభవం.

కొత్త వరి, అపరాల సాగులో నైపుణ్యం
డెయిరీ రంగంలో అందెవేసిన చేయి

లాభసాటి వ్యవసాయానికి చిరునామా.
సొంత మార్కెటింగ్‌ పద్ధతికి ప్రతిరూపం.

2012లో ఉప్పల ప్రసాద్‌కి రైతు నేస్తం పురస్కారం.
నేటి యువతకు ఆదర్శం ప్రసాద్‌ సేద్య విధానం.

కృష్ణా జిల్లా ఘంటశాలపాలెంకి చెందిన ఉప్పల ప్రసాదరావు... వ్యవసాయ రంగంలో పడిలేచిన కెరటం. జీవితంలో అనేక ఒడుదొడుకులు, కష్టనష్టాలని ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన ధీశాలి. పాడి పంట రెండు కళ్లుగా ఒంటిచేత్తో రెండు వందల ఎకరాల్లో వరిసాగు, 250 పశువులని పోషిస్తున్న ఆదర్శ రైతు. స్వామి వివేకానంద సూక్తుల స్ఫూర్తి, పదిమందికి ఉపయోగపడే పనులు చేయాలన్న తండ్రి సూచనలతో... వ్యవసాయాన్ని సేవా కార్యంగా భావించి... 4 దశాబ్దాలుగా అలుపెరగని కృషితో  అద్భుత ప్రయోగాలు చేస్తున్న శ్రమజీవి. పంటల సాగు, మార్కెటింగ్‌లో తలపండిన అనుభవాలతో... వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మలచుకోవాలో చేతల్లో చూపిన కార్యసాధకుడు. కష్టంలో శ్రమైక జీవన సౌందర్యం దాగి ఉందంటూ సేద్యంలో చేయి తిరిగిన ఆదర్శ రైతుగా ఎదిగిన ఉప్పల ప్రసాద్‌ ప్రతిభని ఏనాడో గుర్తించిన రైతు నేస్తం ఫౌండేషన్‌ 2012లో ఉత్తమ రైతు అవార్డుతో సత్కరించింది.
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com and the details are below.

1. Music: bensound creativeminds
Website: www.bensound.com
2. Music: bensound dreams
Website: www.bensound.com
3. Music: bensound cute
Website: www.bensound.com
4.Music: bensound little idea.
Website: www.bensound.com

Комментарии

Информация по комментариям в разработке