Ye Reethi Sthuthiyinthuno O Yesu Nadha Daivama || ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా

Описание к видео Ye Reethi Sthuthiyinthuno O Yesu Nadha Daivama || ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా

#chandu calvary cj#CalvaryBaptistChurch#TeluguChristionSong
ye reethi sthuthiyinthuno
Calvary Baptist Church Aswaraopeta,Bhadradri kothagudem District in Telangana State
Video link
   • స్తుతియించి కీర్తించి ఘనపరతును  నా యే...  
   • తల్లి కున్నదా తండ్రి కున్నదా నీ ప్రేమ...  
Lyrics-Thathapudi JyothiBabu
music&singing\\ Chandu calvary
Telugu papulur Christian Songs
ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా
ఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబును
నీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యా
నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో – నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి||

ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకు
ఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్ను
ఏ భయము నీకేల యనుచు – అభయంబు నిచ్చావయ్యా
ఏ దారి కనబడని వేళ – నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి||

ఈ మనుష్యులు ఈ వైరులు – ఎన్నెన్నో చేసిన గాని
నా ప్రాణము నా దేహము – నీ స్వాధీనంభేగదయ్యా
నా స్వామి నాతోనే ఉంటూ – నా కాపరిగ నిలిచావయ్యా
నాకేమి స్పృహ లేని వేళ – ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి||

నీ ప్రేమను నీ పేరును – నేనెన్నడూ మరువలేను
నీ కరుణను నీ జాలిని – ఏ మనిషిలో చూడలేను
నిజ దైవము నీవే యనుచు – నీ వైపే నే చూచానయ్యా
యెహోవా రాఫా నేననుచు – ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి||

Комментарии

Информация по комментариям в разработке