వరద బాధితులకు అండగా.. శ్రీ స్వామి నారాయణ స్కూల్ విద్యార్థులు..!

Описание к видео వరద బాధితులకు అండగా.. శ్రీ స్వామి నారాయణ స్కూల్ విద్యార్థులు..!

వరద బాధితులకు అండగా..
శ్రీ స్వామి నారాయణ స్కూల్ విద్యార్థులు..!
=============
విజయవాడ శ్రీ స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ వరద బాధితులకు అండగా నిలిచింది. తన వంతు సహాయంగా బాధితులకు, నిరాశ్రయులకు భోజన పంపిణీ కార్యక్రమం చేపట్టింది. కేతనకొండ సమీపంలోనే ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు గురుకుల్ స్కూల్ విద్యార్థులు ఆహార పొట్లాలు అందజేశారు. ఇక్కడే ఒక ఆసక్తికర సంఘటన ఆ స్కూల్ విద్యార్థులకు ఎదురైంది. గతంలో గురుకుల్ స్కూల్లో ఆయాగా పని చేసిన ఓ వృద్ధురాలు, ఈ వరదల కారణంగా నిరాశ్రయురాలు అయింది. ఆయాను గుర్తించిన స్కూల్ విద్యార్థులు.. పరుగు పరుగున ఆమె దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఆమెకు భోజనాన్ని అందజేశారు. పిల్లలను చూసిన ఆమె కన్నీటి పర్యంతం అయింది. తనను గుర్తు పెట్టుకుని, తన పట్ల చూపించిన పిల్లల ప్రేమకు ఆయమ్మ భావోద్వేగానికి లోనైంది. ఈ సంఘటన చూసిన చుట్టుపక్కల వారంతా పిల్లలకు శ్రీ నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA

Комментарии

Информация по комментариям в разработке