కిడ్స్ స్పెషల్ స్నాక్స్ రెసిపీలు | Kids Special Snacks Recipes | Evening Snacks

Описание к видео కిడ్స్ స్పెషల్ స్నాక్స్ రెసిపీలు | Kids Special Snacks Recipes | Evening Snacks

కిడ్స్ స్పెషల్ స్నాక్స్ రెసిపీలు | Kids Special Snacks Recipes | Evening Snacks @HomeCookingTelugu

#కిడ్స్ స్పెషల్ స్నాక్స్ రెసిపీలు #kidsspecial #snacksrecipes
#guntapongadalu #punugulu #tiffins #bananadosa #homecookingtelugu #aratipandudosa #bananapancakes #homecooking #hemasubramanian #minipancakes #pancakerecipe #tiffinrecipe

Chapters:-
Promo - 00:00
How to make Gunta Ponganalu - 00:17
How to make Banana Dosa - 06:00
How to make Mini Vegetable Rottelu - 10:00
How to make Corn Pakodi - 13:50

గుంత పొంగణాలు | Gunta Ponganalu

కావలసిన పదార్థాలు:-

బియ్యం - 1 కప్పు
మినప్పప్పు - 1 / 4 కప్పు
మెంతులు - 1 / 2 టీస్పూన్
నీళ్ళు
ఉప్పు - 1 /2 టీస్పూన్
నూనె - 2 టీస్పూన్లు
మినప్పప్పు - 1 టీస్పూన్
పచ్చిశనగపప్పు - 1 1 / 2 టీస్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఇంగువ - 1 / 2 టీస్పూన్
తరిగిన అల్లం
పచ్చిమిరపకాయలు - 2
ఉల్లిపాయ - 1
కరివేపాకులు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
తురిమిన పచ్చికొబ్బరి - 2 టేబుల్స్పూన్లు
తరిగిన కొత్తిమీర
నూనె

తయారుచేసే విధానం:

ముందుగా ఒక బౌల్లో బియ్యాన్ని మూడు గంటలపాటు నీళ్ళలో నానపెట్టి ఉంచాలి

ఇంకొక బౌల్లో మినప్పప్పు, మెంతులు వేసి మూడు గంటలపాటు నీళ్ళలో నానపెట్టాలి

మూడు గంటల తరువాత ఒక మిక్సీలో నానపెట్టిన బియ్యం మాత్రమే వేసి, కొన్ని నీళ్ళు పోసి, కాస్త బరకగా అయ్యేట్టు రుబ్బిన తరువాత నానపెట్టిన మినప్పప్పు, ఉప్పు వేసి, బాగా మెత్తగా అయ్యేట్టు రుబ్బి పక్కన పెట్టుకోవాలి (మధ్యలో కావాలంటే చాలా కొద్దిగా నీళ్ళు పోస్తూ పిండి రుబ్బాలి)

రుబ్బిన పిండిని ఒక బౌల్లోకి మార్చి, కావాలంటే కొన్ని నీళ్ళు పోసి కలిపి, కనీసం ఎనిమిది గంటలపాటు పులియపెట్టాలి

ఆ తరువాత తాలింపు కోసం ఒక ప్యాన్లో నూనె వేసి వేడి చేయాలి

నూనె వేడెక్కిన తరువాత అందులో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి

ఆవాలు చిటపటలాడిన తరువాత ప్యాన్లో ఇంగువ వేసి, పొయ్యిని మీడియం లో-ఫ్లేములోనే ఉంచి వేయించాలి

ఆ తరువాత తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేయించిన తరువాత కరివేపాకులు, ఉప్పు వేసి కలపాలి

చివరగా తురిమిన పచ్చికొబ్బరి, కొత్తిమీర వేసి బాగా కలపాలి

తయారైన తాలింపును పులియపెట్టిన పిండిలో వేసి బాగా కలిపి, అవసరమైతే నీళ్ళు పోసి కలపాలి

ఒక గుంతల పెనం వేడి చేసి, అందులో నూనె వేసిన తరువాత పొంగణాల పిండి వేసి, రెండు వైపులా చెరొక నాలుగు నిమిషాలు కాల్చాలి

అంతే, ఎంతో రుచిగా ఉండే గుంత పొంగణాలు తయారైనట్టే, వీటిని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో లేదంటే సాంబార్తో సర్వ్ చేసుకోవచ్చు


Banana Dosa | బనానా దోశ

కావలసిన పదార్థాలు:

అరటిపళ్ళు - 3
తురిమిన బెల్లం - 1 కప్పు
తురిమిన పచ్చికొబ్బరి - 1/2 కప్పు
యాలకుల పొడి - 1/2 టీస్పూన్
తరిగిన జీడిపప్పులు - 1 టేబుల్స్పూన్
బేకింగ్ పొడి - 1/2 టీస్పూన్
చిటికెడు ఉప్పు
గోధుమపిండి - 1/2 కప్పు
పాలు - 1/2 కప్పు
గోధుమపిండి - 1/2 కప్పు

తయారుచేసే విధానం:

బాగా పండిన అరటిపళ్ళను స్లైసులుగా కోసి, ఒక బౌల్లో వేసిన తరువాత తురిమిన బెల్లం, తురిమిన పచ్చికొబ్బరి, యాలకుల పొడి, తరిగిన జీడిపప్పులు, వంట సోడా వేసి, చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా కలపాలి

ఇందులో కొద్దిగా గోధుమపిండి వేసి మొత్తం కలిపిన తరువాత పాలు పోసి మళ్ళీ కలపాలి

ఈ మిశ్రమంలో మళ్ళీ గోధుమపిండి వేసి కలిపిన తరువాత పాలు పోసి కలపాలి. ఇలా పిండిని ఒకసారే వేయకుండా రెండు సార్లు వేసి కలపడం వల్ల దోశపిండి కరెక్టుగా వస్తుంది

ఒక పెనాన్ని వేడి చేసి, పైన కొద్దిగా నెయ్యి రాయాలి

ఒక గరిటెతో వేడి పెనం మీద చిన్న చిన్న దోశలు వేసి రుద్దకుండా అలానే వదిలేయాలి

దోశకి అంచుల్లో, అలానే పైన కూడా కొద్దిగా నెయ్యి వేయాలి

ఈ దోశలు ఒకవైపు కాలిన తరువాత రెండో వైపుకి తిప్పి కాల్చాలి

ఇవి రెండు వైపులా బాగా కాలిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు

అంతే, అరటిపళ్ళ దోశలని వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు


మినీ వెజిటబుల్ రొట్టెలు | Mini Vegetable Rottelu

కావలసిన పదార్థాలు:

నూనె - 3 టీస్పూన్లు
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి రెబ్బలు - 5
పచ్చిమిరపకాయలు - 3
తురిమిన క్యాబేజి - 1 బౌల్
తురిమిన క్యారెట్లు - 2
ఉప్పు - 1 టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
తరిగిన కొత్తిమీర
గోధుమపిండి - 1 / 2 కప్పు
వేయించిన శనగపప్పు పొడి - 1 / 2 కప్పు
నీళ్ళు
నూనె


కార్న్ పకోడీ | Corn Pakodi

కావలసిన పదార్థాలు:

ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు
ఉల్లిపాయలు - 2 (పొడవుగా తరిగినవి)
తరిగిన అల్లం
పచ్చిమిరపకాయలు - 3
కరివేపాకులు
పసుపు - 1 / 4 టీస్పూన్
కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ఇంగువ - 1 / 2 టీస్పూన్
గరం మసాలా పొడి - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
శనగపిండి - 1 కప్పు
బియ్యప్పిండి - 2 టేబుల్స్పూన్లు
కొత్తిమీర
నీళ్ళు
నూనె

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / home.cooking.telugu  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке