Afghani chicken Gravy curry recipe | Chicken Afghani curry | Chicken curry recipe @HomeCookingTelugu
అఫ్ఘానీ చికెన్ మన రోటీ, ఫుల్కాలాంటి వాటిల్లోకి అద్భుతంగా ఉండే ఒక చికెన్ సైడ్ డిష్ అని చెప్పచ్చు. ఈ రెస్టారంట్ స్టైల్ కూర మైల్డ్ టేస్ట్తో భలే రుచిగా ఉంటుంది. ఇదెలా చేయాలో తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోను చూడండి.
#chickenafghani #friedchickenrecipe #chickenrecipes #chickencurry #afghanichicken #afghanichickengravy #homecooking
Here's the link to English version of Afghani Chicken: https://bit.ly/3m4PTuo
తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 40 నిమిషాలు
సెర్వింగులు: 5
కావలసిన పదార్థాలు
చికెన్ - 1 కిలో
ఉల్లిపాయలు - 2 (తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 6 (తరిగినవి)
వెల్లుల్లి రెబ్బలు - 8 (తరిగినవి)
అల్లం ముక్క - 1 (తరిగినది)
కొత్తిమీర - 1 కప్పు
పెరుగు - 1 కప్పు
ఫ్రెష్ క్రీం - 1 / 2 కప్పు
గరం మసాలా పొడి - 2 టీస్పూన్లు
ఉప్పు - 1 1/2 టీస్పూన్లు
చాట్ మసాలా పొడి - 2 టీస్పూన్లు
మిరియాల పొడి - 2 టీస్పూన్లు
కసూరీ మేథీ - 1 టేబుల్స్పూన్
1 / 2 చెక్క నిమ్మరసం
నూనె - 3 టేబుల్స్పూన్లు
యాలకులు - 2
లవంగాలు - 3
దాల్చిన చెక్క - 1 ముక్క
తయారుచేసే విధానం:
చికెన్ను మ్యారినేట్ చేయడానికి ముందుగా పచ్చిమిర్చి కారం కోసం ఒక మిక్సీలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేసి, మెత్తగా రుబ్బి, తయారైన పేస్టును పక్కన పెట్టాలి
ఇప్పుడు అదే పేస్టులో పెరుగు, ఫ్రెష్ క్రీం, గరం మసాలా పొడి, ఉప్పు, చాట్ మసాలా పొడి, మిరియాల పొడి, కసూరీ మేథీ, నిమ్మరసం వేసి, ఉండలు లేకుండా బాగా కలపాలి
ఈ మ్యారినేడ్ను, శుభ్రంగా కడిగి, గాట్లు పెట్టిన చికెన్ మీద వేసి బాగా కలిపి, మసాజ్ చేసి కనీసం ఒక గంటసేపు పక్కన పెట్టాలి
ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి, అందులో మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను పెట్టి, కనీసం పదిహేను నిమిషాల పాటు అన్నివైపులా తిప్పుతూ కాల్చాలి. ఇవి బాగా వేగి బ్రౌన్ రంగులోకి మారితే బాగుంటుంది
ఆ తరువాత వేగిన చికెన్ ముక్కలను పక్కన ఒక ప్లేట్లో పెట్టి, అదే ప్యాన్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించిన తరువాత, మ్యారినేడ్లో మిగిలిన గ్రేవీను వేసి కలపాలి
ప్యాన్కు ఒక మూత పెట్టి, గ్రేవీను మీడియం ఫ్లేములో కనీసం పది నిమిషాల పాటు ఉడికిస్తే, నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది
ఈ పాయింట్లో వేయించిన చికెన్ ముక్కలు వేసి కలిపి, ప్యాన్కు ఒక మూత పెట్టి, పొయ్యిని మీడియం ఫ్లేములోనే ఉంచి, చికెన్ను మరొక పదిహేను నిమిషాలు గ్రేవీలో మగ్గనివ్వాలి
ఆ తరువాత చుస్తే మీకు అఫ్ఘానీ చికెన్ తయారయ్యి కనిపిస్తుంది, దీని పైన పచ్చిమిర్చి, పొడవుగా తరిగిన అల్లం, చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసి వెంటనే రోటి, నాన్ లేదంటే ఫుల్కాతో సర్వ్ చేసుకోవచ్చు
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...
Hello Viewers,
Today we are going to see one of the most delicious chicken gravy curry recipe Afghani chicken, It tastes absolutely amazing with naan , roti or chapati. Making of this recipe is very simple quick and easy which is similar to any chicken curry recipes which involves marinating of chicken, frying of chicken followed by making of gravy and yummy Afghani chicken, with the same method of how to make chicken Afghani, we can make any chicken curry with slight variations in Ingredients, Hope you try this tasty chicken curry recipe at your home and enjoy.
You can buy our book and classes on http://www.21frames.in/shop
Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook- / homecookingtelugu
Youtube: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com
Информация по комментариям в разработке