నల్లమల లో ఎన్నో చారిత్రక ప్రదేశాల గురించి మనం గతంలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం నల్లమలలో ఉన్న 5 శివలింగాల్లో రహస్యంగా ఉన్న ఐదవ శివలింగం గురించిన సమాచారం తెలుసుకుందాం.
ఇప్పుడైతే రోడ్డు మార్గం ద్వారా మనం శ్రీశైలం చేరుకుంటున్నాం కానీ పూర్వం శ్రీశైలం చేరాలంటే శ్రీశైలానికి నాలుగు దిక్కుల నుండి పురాతనమైన మార్గాలను ఆనాటి రాజులు నిర్మించారు. ఈ మార్గాల వెంట భక్తుల సౌకర్యార్థం గుడులు ,మఠాలు, మంచినీటి చెరువులు, బావులు వంటి ఎన్నో నిర్మాణాలు చేశారు.
శ్రీశైల ప్రాంతా నల్లమల అడవిలో ప్రతి రాయి శివుని స్వరూపమే. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనం ఇస్తారు. శ్రీశైల ప్రాంతంలో మొత్తం ఐదు శివలింగాలు 12 తీర్థాలు ఉన్నట్లు చెబుతారు.
అయితే ఈ ఐదు లింగాలలో నాలుగు లింగాలు అందరికీ తెలిసినవే శ్రీశైల మల్లికార్జున స్వామి, సలేశ్వరం లింగమయ్య స్వామి, లొద్ది మల్లన్న , ఉమామహేశ్వరం.
ఐదవ శివలింగం దట్టమైన నల్లమల్ల అడవిలో ఒక ప్రాచీన నగరం ఉందని ఆ నగరంలోనే ఈ ఐదవ శివలింగం ఉందని భావిస్తారు.
నల్లమల ప్రాంతా అడవిలో మనకు పురాతనమైన కోటలు ఉన్నట్లు ఆనవాళ్లు తెలుస్తున్నాయి అవి చంద్రగుప్తపట్టణం, పట్టపరుద్రునికోట (ప్రతాపరుద్రునికోట), సిద్దాపురం కోట మొదలైనవి.
ఈ వీడియోలో మనం చూసే ప్రాంతం పట్టపరుద్ధుని కోట ప్రాంతం. దీని నిర్మాణం 8వ శతాబ్దంలో ప్రారంభమై 13వ శతాబ్దం వరకు కొనసాగింది. ఎనిమిదవ శతాబ్దంలో అమ్రాబాద్ ప్రాంతాన్ని పట్టభద్రుడు అనే సామంత రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఈనే అరణ్యంలో కోట నిర్మాణానికి పునాది వేశారు.
శాలంకాయనులు , విష్ణుకుండినులు ఈ కోటను ఆక్రమించే ప్రయత్నాలు చేశారు అనంతరం కళ్యాణిచాళుక్యులు ఏలుబడిలోకి ఈ కోట వెళ్ళింది.
12వ శతాబ్దంలో కాకతీయుల ఆధీనంలోకి ఈ కోట వచ్చింది. కాకతీయ ప్రతాపరుద్రుడు దుర్గాన్ని రక్షణగా దాదాపు 120 కిలోమీటర్ల వరకు కోట గోడలను నిర్మించారు. అప్పటినుండి దీన్ని ప్రతాపరుద్రుని కోటగా పిలుస్తున్నారు.
ఈ కోట పరిధిలోనే మేడిమల్కల సంగడిగుండాల, వీర్లపెంట, అప్పాపూర్, భౌరాపూర్ చెంచు గ్రామాలు వస్తాయి. మేడిమలంక లో రుద్రమదేవి శిలాశాసనం ఈనాటికి ఉంది.
fort in nallamala forest,nallamala forest,places to see in srisailam,visiting places in srisailam,nallamala forest map,prataparudra fort,nallamala, #vanishingcityinnallamalaforest , ancient city, ancient,nallamala forest secrets,srisailam,srisailam temple,history behind srisailam shivalingam,jyotirlinga in srisailam,srisailam history,srisailam shiva lingam,srisaila kshetram,ontari yatrikidu,An #ancientcityinNallamala , #Prataparudra'sfortinSrisailamforest.
https://www.youtube.com/results?searc...
https://www.facebook.com/profile.php?...
/ srinivas_ontariyatrikudu
Информация по комментариям в разработке