Sai Gurukulam Episode 1308 //హరివినాయక్ సాఠే భార్య లక్ష్మీతో సాయికి ఉన్న ప్రేమానుబంధం.

Описание к видео Sai Gurukulam Episode 1308 //హరివినాయక్ సాఠే భార్య లక్ష్మీతో సాయికి ఉన్న ప్రేమానుబంధం.

Sai Gurukulam Episode 1308 //హరివినాయక్ సాఠే భార్య లక్ష్మీతో సాయికి ఉన్న ప్రేమానుబంధం.

హరి వినాయక్ సాఠే 1855లో జన్మించాడు. అతను డిప్యూటీ కలెక్టరుగా పనిచేసేవాడు. 44 ఏళ్ళ వయసులో అతను తన భార్యను కోల్పోయాడు. అప్పటికి అతనికి ఒక కుమార్తె మాత్రమే ఉంది. వంశోద్ధారకుని కోసం రెండవ వివాహం చేసుకోమని స్నేహితులంతా అతనిని ఒత్తిడి చేయసాగారు. అతనికి కూడా వంశోద్ధారకుడు కావాలన్న కోరిక బలంగా ఉన్నప్పటికీ 50 సంవత్సరాలు సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ వివాహం చేసుకుంటే కొడుకే పుడతాడన్న నిశ్చయమేమిటని అనుకున్నాడు. అందువల్ల ఆ విషయంలో తనని బలవంతపెడుతున్న స్నేహితులతో, "ఎవరైనా మహాత్ములు హామీ ఇస్తేగానీ మళ్ళీ వివాహం చేసుకోన"ని ఖండితంగా చెప్పాడు. 1904, ఏప్రిల్‌ నెలలో అతడు ఆఫీసు పనిమీద కోపర్‌గాఁవ్ వెళ్ళాడు. అక్కడ మామల్తదారుగా ఉన్న అతని స్నేహితుడు బార్వే అతనితో, 'శిరిడీలో సాయిబాబా అనే గొప్ప మహాత్ములున్నార'ని చెప్పి, అతన్ని శిరిడీ తీసుకెళ్లాడు. ఇద్దరూ బాబా దర్శనం చేసుకున్నారు. కొంతసేపటికి సెలవు తీసుకుని సాఠే మశీదు మెట్లు దిగుతుండగా బార్వే, "సాహెబ్‌కు కొడుకు లేడ"ని బాబాతో అన్నాడు. అప్పుడు బాబా, "అతడు వివాహం చేసుకుంటే అల్లా అతనికి కొడుకుని ప్రసాదిస్తాడు (షాదీ కరేగా తో అల్లా బచ్చా దేగా)" అని అన్నారు. ఇక అప్పటినుండి బార్వే తదితర స్నేహితులు సాఠేను మళ్ళీ పెళ్లి చేసుకోమని మరలా ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఆ సంవత్సరాంతంలో ఒక ప్రసిద్ధ జ్యోతిష్కుడు పూణే వచ్చి ఉన్నారని తెలిసి సాఠే అతన్ని సంప్రదించాడు. అతను సాఠేకు, అతని కూతురికి గతంలో జరిగిన కొన్ని విషయాలు యథాతధంగా చెప్పాడు. అంతేకాకుండా సాఠే జాతకచక్రాన్ని పరిశీలించి 50వ సంవత్సరం తరువాత అతనికి కొడుకు పుడతాడని చెప్పాడు. దాంతో మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న సాఠే ఆలోచన బలపడినట్లయింది.

తరువాత కొన్ని మాసాలకి సాఠేకు అహ్మదాబాద్ బదిలీ అయ్యింది. ఒకరోజు దాదాకేల్కర్ (గణేష్ దామోదర్ కేల్కర్) తనకు పెళ్ళీడుకొచ్చిన ఒక కుమార్తె ఉందని,  అహ్మదాబాదులో ఆమెకు తగిన సంబంధాలేవైనా ఉంటే తెలుపమని సాఠేకు ఉత్తరం వ్రాశాడు. ఆ ఉత్తరం పెండ్లికొడుకుల అన్వేషణకుగాక, అతని కుమార్తె విషయంలో తన అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి వ్రాసినట్లుగా సాఠేకు తోచింది. అంతేకాకుండా ఆ ఉత్తరం వెనుక శ్రీసాయిబాబా పరోక్ష ప్రభావం కూడా అందుకు సాఠే, "అలాగైతే మీ కుమార్తెను మీతోపాటు శిరిడీ తీసుకెళ్ళి శ్రీసాయిబాబాకు చూపించి, వారి అనుమతి తీసుకోండి. బాబా అనుమతి లేనిదే నేను వివాహం చేసుకోను" అని జవాబు వ్రాశాడు. ఆ సమయంలో దాదాకేల్కరుకు బాబాపట్ల వ్యతిరేక భావమున్నందున తన కుమార్తెను సాఠేకి ఇవ్వడానికి బాబా అనుమతించరేమోనని, దాంతో వివాహం జరగదేమోనని సందేహించాడు. అందువలన 'వాయి'లోని బ్రాహ్మణ పండితుని (అతని బావమరిదిని) సంప్రదిస్తానని చెప్పాడు. అందుకు సాఠే ఒప్పుకోక, బాబా వద్దకు వెళ్ళి వారి అనుమతి తీసుకోవలసిందేనని పట్టుబట్టాడు. దాంతో కేల్కర్ తన కుమార్తెను తీసుకుని శిరిడీకి వెళ్లి, మాధవరావు సహాయంతో బాబా అనుమతి కోసం వేచివున్నాడు. అతను బాబా వద్దకు వెళ్ళగానే ఆయన అతని కుమార్తె నుదుటిపై కుంకుమ పెట్టి, "అమ్మాయిని అహ్మదాబాద్ పంపు" అని అన్నారు. అంటే సాఠేతో వివాహం జరిపించమని పరోక్షంగా బాబా తెలిపారు. బాబా వివాహానికి అనుమతించారన్న సమాచారాన్ని సాఠేకు అందించారు. బాబా అనుమతి లభించడంతో సాఠే తన యాభయ్యవ ఏట 1905 కేల్కర్ కుమార్తెను వివాహమాడాడు.

వివాహానంతరం సాఠే తన భార్యతోపాటు బాబా ఆశీస్సులకోసం శిరిడీ వెళ్ళాడు. అప్పుడు అతడు బాబాకు ఒక శాలువాను, వెండి భరిణెను ఇచ్చాడు. బాబా తమ దివ్యహస్తాలతో వాటిని పవిత్రపరచి తమ ఆశీస్సులతోపాటు అతనికి తిరిగి ఇచ్చారు.

సాఠే దంపతులకు మొదట ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అప్పుడు దాదాకేల్కర్, అతని భార్య బాబా వద్దకు వెళ్ళి, "మాకు మనవడిని ఎప్పుడు ప్రసాదిస్తారు బాబా?" అని అడిగారు. అందుకు బాబా, “నేను అల్లాను అభ్యర్థిస్తున్నాను. అతను నా అభ్యర్థనను మన్నిస్తాడు" అని బదులిచ్చారు. తరువాత ఒకటి, రెండు సంవత్సరాలకు, అంటే 1913లో బాబా అనుగ్రహంతో సాఠేకు ఆరోగ్యకరమైన చక్కటి పుత్రుడు జన్మించాడు. సాఠేకు వివాహం జరిపించడం, ఆ తరువాత అతనికి సంతానాన్ని ప్రసాదించడం సాఠేకు బాబా చేసిన గొప్ప ఉపకారాలు.

Комментарии

Информация по комментариям в разработке