ఎత్తుకు పై ఎత్తులతో సాగిపోయే "ప్రతాపరుద్రీయం" నాటకం | Prataparudriyam | Rajan PTSK

Описание к видео ఎత్తుకు పై ఎత్తులతో సాగిపోయే "ప్రతాపరుద్రీయం" నాటకం | Prataparudriyam | Rajan PTSK

ఓరుగల్లును రాజధానిగా చేసుకుని త్రిలింగదేశాన్ని పరిపాలించిన మహారాజు ప్రతాపరుద్రుడు. ఆయన పేరుతో నడిచే ఈ కథలో కీలక పాత్ర మాత్రం మహామంత్రి యుగంధరుడిది. వందలయేళ్ల క్రితం నాటి ఈ కథ జానపదుల నోళ్లలో నానుతూ, తరతరాలుగా ముందుకు సాగుతూ వచ్చింది. అలా వచ్చిన ఆ కథ తెలుగువారికి ప్రాతఃస్మరణీయులైన వేదం వేంకటరాయశాస్త్రి గారి చెవిన పడింది. అప్పుడాయనకు సుమారుగా ఎనిమిదేళ్లు. తన తండ్రి చెప్పగా విన్న ఆ కథ వేదంవారి హృదయలో నాటుకుపోయింది. ఆ తరువాత కాలంలో వేంకటరాయశాస్త్రిగారు పెరిగి పెద్దవారయ్యాక కథలోని పాత్రల్ని, సన్నివేశాల్నీ పెంచి 1897లో అంటే సుమారు 125 సంవత్సరాల క్రితం ప్రతాపరుద్రీయం అనే పేరుతో నాటకంగా రచించారు. ఆ నాటకానికి దక్కిన ఆదరణ అంతా ఇంతా కాదు. తెలుగు సాహిత్యంలోనే అత్యుత్తమ నాటకాలలో ఒకటిగా పేర్కొనే ప్రతాపరుద్రీయం కథలోకి ప్రవేశిద్దాం
Rajan PTSK

#teluguliterature #teluguclassics #VedamuVenkatarayaSastry

Комментарии

Информация по комментариям в разработке