మహాకవి శ్రీశ్రీ కవిత్వ పరిచయము - Mahakavi SriSri Kavitva Parichayamu

Описание к видео మహాకవి శ్రీశ్రీ కవిత్వ పరిచయము - Mahakavi SriSri Kavitva Parichayamu

“మహాప్రస్థానా”నికి యోగ్యతాపత్రం రాస్తూ “కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ” అన్నాడు చలం. ఆయన మాటల పొందికలోనే చెప్పాలంటే… నిన్న కృష్ణశాస్త్రి కవిత్వం చదువుతూ, ఆయన పడ్డ బాధను చూసి మనమంతా కూడా దిగాలుపడ్డాం. ఈ రోజు మన బాధనంతా తన బాధగా పలికించిన మహాకవి కవిత్వం పట్టుకొని సేదదీరబోతున్నాం.
అసలు ఎవరీ శ్రీశ్రీ. తెలుగులో కవిత్వం పేరెత్తగానే అందరి తలలూ ఆయనవైపెందుకు తిరుగుతాయి? “రెండు శ్రీల ధన దరిద్రుడు - కవితా ఘన సముద్రుడు శ్రీశ్రీ” అని వేటూరి సంస్మరించుకున్న ఆ ఘనసముద్రంలో ఉన్న రత్నమాణిక్యాలేమిటి? వాటి కాంతుల ధగధగలు ఎలా ఉంటాయి? ఇవన్నీ తెలుసుకుంటూ, ఆ రత్నపుకాంతులు చూసుకుంటూ పదండి ముందుకు, పదండి త్రోసుకు, పదండి పోదాం పైపైకి!

సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే [email protected] కు email చెయ్యండి.

అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.



Rajan PTSK #RajanPTSK #SriSri #Kavitvam

Комментарии

Информация по комментариям в разработке