చురుక్కుమనిపించే విశ్వనాథ వారి చమక్కులు - Viswantha Satyanarayana | Rajan PTSK | Ajagava

Описание к видео చురుక్కుమనిపించే విశ్వనాథ వారి చమక్కులు - Viswantha Satyanarayana | Rajan PTSK | Ajagava

NTR పై విశ్వనాథ వారి సరదా చమక్కు


“మాట్లాడే వెన్నెముక
పాట పాడే సుషుమ్న
నిన్నటి నన్నయభట్టు
నేటి కవి సమ్రాట్టు
గోదావరి పలుకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలుగువాళ్ళ గోల్డునిబ్బు
అకారాది క్షకారాంతం
ఆసేతు మహికావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి
అనవరతం తెలుగువాడి ప్రకాస్తి
ఛందస్సు లేని ఈ ద్విపద
సత్యానికి నా ఉపద”
అంటూ మహాకవి శ్రీశ్రీ గారు నమస్కరించుకున్న నిలువెత్తు తెలుగుతనం మన విశ్వనాథ సత్యనారాయణ గారు. “తెలుగులో ఉన్న పన్నెండుగురు ప్రాచీన మహాకవుల తరువాత పదమూడవ వాణ్ణి నేను” అని అనగలిగిన ధిషణాహంకారం కల కవిసమ్రాట్ ఆయన. వారి మాట కాస్త కరకే అయినా, మనసు మాత్రం తియ్యని చెఱకే. నచ్చని విషయాన్ని నిర్మొహమాటంగా ముఖంపై గుద్దినట్టు చెప్పడం విశ్వనాథవారికి అలవాటు, కాకపోతే వారు మహాకవులు కనుక, ఆ చెప్పడంలో కూడా వ్యగ్యం తొణికిసలాడుతుంటుంది. ఒక్కోసారి తనకు ఇష్టమైనవారిపై కూడా ఛలోక్తులు విసిరి సరదాగా వాళ్ళను ఏడిపించడం, అక్కడ ఉన్నవారందరినీ నవ్వించడం వారికో సరదా.

ఈరోజు కాసేపు విశ్వనాథవారి చురుక్కుమనిపించే చమక్కులు కొన్ని చెప్పుకుందాం.
- Rajan PTSK

#RajanPTSK #Viswanatha #Viswanadha

Комментарии

Информация по комментариям в разработке