కాజూ మసాలా కర్రీ | Dhaba Style Kaju Masala Curry in Telugu | Kaju Masala Curry

Описание к видео కాజూ మసాలా కర్రీ | Dhaba Style Kaju Masala Curry in Telugu | Kaju Masala Curry

కాజూ మసాలా కర్రీ | Dhaba Style Kaju Masala Curry in Telugu | Kaju Masala Curry @HomeCookingTelugu

#kajumasala #kajumasalacurry #dhabastyle

Our Other Recipes:

Pudina Kaju Pakodi:    • స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడే పుదీనా ...  
Jeedipappu Pulao:    • జీడిపప్పు పులావ్ | Cashew Pulao | Veg...  
Kaju Rice:    • బిర్యానీకి ఏమాత్రం తీసిపోని రుచి ఈ అద...  
Cashewnut Rice:    • జీడిపప్పు పులావ్ | Cashew Pulao | Veg...  
Ullipaya Jeedipappu Pakodi:    • జీడిపప్పు-ఉల్లిపాయ పకోడీ | Cashew Oni...  
Phulka:    • పాలక్ సాగెర్ చోర్చోరీ & ఫుల్కా | Pala...  
Sada Paratha:    • సాదా పరాఠా | Plain Paratha | Sada Par...  

తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 40 నిమిషాలు
సెర్వింగులు: 6

కావలసిన పదార్థాలు:

నీళ్ళు
టొమాటోలు - 3
జీడిపప్పులు - 75 గ్రాములు
వేయించడానికి సరిపడా నూనె
జీడిపప్పులు - 200 గ్రాములు
నూనె - 2 టేబుల్స్పూన్
నెయ్యి - 1 టేబుల్స్పూన్
ఉల్లిపాయ - 1
తరిగిన అల్లం
తరిగిన వెల్లుల్లి
పచ్చిమిరపకాయలు - 2
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - 1 / 2 టీస్పూన్
కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టీస్పూన్లు
జీలకర్ర పొడి - 1 టీస్పూన్లు
నీళ్ళు
నూనె - 2 టేబుల్స్పూన్లు
నెయ్యి - 1 టేబుల్స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
దాల్చిన చెక్క
లవంగాలు
యాలకులు - 2
ఉల్లిపాయ - 1
గరం మసాలా పొడి - 1 టీస్పూన్
కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
ఉప్పు - 1 టీస్పూన్
పంచదార - 1 / 2 టీస్పూన్
నీళ్ళు - 1 / 2 కప్పు
కసూరీ మేథీ
తరిగిన కొత్తిమీర

తయారుచేసే విధానం:

ముందుగా గాట్లు పెట్టిన టొమాటోలను, కొన్ని జీడిపప్పులను నీళ్ళలో వేసి పది నిమిషాలు ఉడికించాలి

ఆ తరువాత టొమాటోలను, జీడిపప్పులను బయటకి తీసి, టొమాటోలకు తొక్క తీసేసి, పక్కన పెట్టుకోవాలి

ఒక వెడల్పాటి బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి, అందులో ఇంకొన్ని పచ్చి జీడిపప్పులు వేసి వేయించాలి

జీడిపప్పులన్నీ మంచి బ్రౌన్ రంగులోకి మారిన తరువాత బయటకి తీసేసి, పక్కన పెట్టుకోవాలి

ఒక ప్యాన్లో నూనె, నెయ్యి, వేసి, అందులో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉడికించిన జీడిపప్పులు, టొమాటోలు వేసిన తరువాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపిన తరువాత కొన్ని నీళ్లు పోసి రెండు మూడు మూడు నిమిషాలు మరిగించాలి

ఆ తరువాత ఈ మిశ్రమాన్ని మొత్తం బయటకి తీసి, చల్లార్చి, ఒక మిక్సీలో వేసి, మెత్తటి పేస్టు అయ్యేట్టు రుబ్బాలి

ఒక కడాయిలో నూనె, నెయ్యి వేసి, అందులో జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఉల్లిపాయలు కూడా వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి

ఇందులో రుబ్బిన మసాలా పేస్టు, కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి పది నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి

ఇందులో గరం మసాలా పొడి, కాశ్మీరీ కారం, ఉప్పు, పంచదార వేసి అంతా బాగా కలపాలి

గ్రేవీలో మళ్ళీ నీళ్లు పోసి, మూత పెట్టి, కూరని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించాలి

చివరగా ఇందులో నిలిపిన కసూరీ మేథీ, తరిగిన కొత్తిమీర, వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసి బాగా కలపాలి

అంతే, ధాబా స్టైల్ కాజు మసాలా కర్రీ తయారైనట్టే, దీన్ని మీకు నచ్చిన రోటీతో సర్వ్ చేసుకోవచ్చు

Kaju Masala Curry is a rich cashewnut based gravy curry. In this recipe a lot of cashewnuts are used to bring the taste of cashewnuts in the curry along with onions, tomatoes and other common Indian condiments and spice powders. This recipe involves a few steps but they are very quick and easy to make. You can enjoy this kaju curry with any Indian bread like phulka, roti, naan/chapati etc. Watch this video till the end to get a step-by-step process to make Dhaba style kaju curry easily at home. Do try this recipe and let me know how it turned out for you guys in the comments section below.

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке